పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి లాభాలుంటాయి.. అవి వాస్తవమేనా ?
సాధారణంగా శరీరంలో పుట్టుమచ్చలను బట్టి వారి గుణగణాలను చెప్పేస్తుంటారు. అలాగే మనిషి భవిష్యత్తును కూడా పుట్టు మచ్చల ఆధారంగా
సాధారణంగా శరీరంలో పుట్టుమచ్చలను బట్టి వారి గుణగణాలను చెప్పేస్తుంటారు. అలాగే మనిషి భవిష్యత్తును కూడా పుట్టు మచ్చల ఆధారంగా నిర్ణయిస్తుంటారు. శరీరంలో ఆయా ప్రదేశాల్లో ఉంటే పుట్టు మచ్చలను బట్టి అదృష్టవంతులని, నాయకత్వ లక్షణాలుంటాయని.. కష్టాలు ఎక్కువగా అని అంటుంటారు. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఉంటే గుర్తులు, సంకేతాలు నిర్దిష్టమైన అర్థాన్ని కలిగి ఉంటాయట. అంతేకాకుండా ఈ మచ్చలు మనుషుల హృదయాల గురించి వివరిస్తాయట. పెదవులపై పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ముఖ్యంగా మహిళలకు పెదవులపై పుట్టు మచ్చలు ఉండడం వలన భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. మరీ పుట్టు మచ్చలు ఉన్న పురుషుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామా.
1. రెండు కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉన్నవారికి ఆత్మగౌరవం ఎక్కువగా లభిస్తుందట. అదే కుడి కనుబొమ్మపై ఉంటే మంచి భార్య జీవితంలోకి ప్రవేశిస్తుందట. 2. అలాగే కుడి కంటిలో పుట్టు మచ్చ ఉంటే స్నేహితులు, బంధువుల ద్వారా కీర్తి పొందుతారట. 3. అదే నాభిపై పుట్టు మచ్చ ఉంటే.. అతని భవిష్యత్తు ఎంతో సంతోషంగా… సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతాడట. 4. పురుషులకు కుడి భుజం పై పుట్టు మచ్చ ఉంటే అతను చిన్న చిన్న విషయాలకు సీరియస్ అవుతాడట. 5. అదే పురుషులకు కడుపు మీద పుట్టు మచ్చ ఉంటే అతనికి ప్రాణాంతకం. 6. ఛాతీపై కుడివైపున పుట్టు మచ్చ ఉంటే అతని జీవితం అర్థాంతరం. 7. ముక్కు మీద పుట్టు మచ్చ ఉంటే వారు ఎక్కువ వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 8. ముక్కుకు కుడివైపు పుట్టు మచ్చ ఉంటే అనుకున్న పని పూర్తి చేసే శక్తి ఉంటుందట.
Banana Benefits: అరటి పండు తింటే తలనొప్పి మాయం.. గర్బిణీ స్త్రీలు వీటిని తినొచ్చా ?
గర్భధారణ సమయంలో ఛాతి నొప్పి వస్తోందా.? అయితే నిర్లక్ష్యం చేయకండి.! ఇది తెలుసుకోండి..