Tulasi Benefits: కరోనా కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడే ఈ దివ్యౌషధ మొక్క గురించి మీకు తెలుసా..? తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడడంలో తులసి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోని అన్ని మతాల వారు తులసిని దివ్యౌషధంగా భావిస్తారు. అందుకు తులసిలో ఉండే ఔషధ గుణాలే కారణం. దీనికి మానవ..
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని కొన్ని నియమాలు పాటించక తప్పదు. తీసుకునే ఆహారంలో విటమిన్లు, కార్బోహైడ్రెడ్లు, ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి సహకరించే ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. లేకపోతే సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడడంలో తులసి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. హిందూ ధర్మంలో దీనిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అలానే భారతదేశంలోని అన్ని మతాల వారు తులసిని దివ్యౌషధంగా భావిస్తారు. అందుకు తులసిలో ఉండే ఔషధ గుణాలే కారణం. దీనికి మానవ శరీరంలోని కఫం, జలుబు, దగ్గును త్వరగా తగ్గించే శక్తి ఉంది. తులసితో మనందరికీ మానసిక అనుబంధం ఉంది.
చలికాలంలో తులసిని సరిగ్గా వాడితే దాదాపు అన్ని రకాల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. శీతాకాలం అంటేనే సీజనల్ వ్యాధులు.. అలాంటే సమయంలో కరోనా వైరస్ BF.7 గా రూపాంతరం చెంది విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మన రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. అందుకోసం కూడా తులసి మీకు ఉపకరిస్తుంది. మరి తులసిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
తులసిని ఎలా ఉపయోగించాలి?
తులసి ఆకులను నూనె, పొడి రూపంలో ఉపయోగించుకోవచ్చు. తులసి టీ తయారు చేసి రోజూ తాగవచ్చు. రోజుకు కనీసం రెండు కప్పుల తులసి టీ తాగాలి. ఉదయం అల్పాహారం సమయంలో ఒకసారి, సాయంత్రం భోజనానికి కొంత సమయం ముందు మరోసారి తీసుకుంటే మేలు జరుగుతుంది. మీకు పాలతో చేసిన టీ తాగడం ఇష్టం లేకపోతే బ్లాక్ టీలో కూడా తులసిని కలుపుకుని తాగవచ్చు. దగ్గు-జలుబు, జ్వరం, ఛాతీలో బిగువు, విపరీతమైన జలుబు వంటివి ఉన్నట్లయితే తులసిని కషాయంగా తీసుకోండి. ఆహారం తిన్న తర్వాత గొంతులో ఎలాంటి సమస్య వచ్చినా తులసి టీకి బదులు తులసి ఆకులను నమలండి. భోజనం చేసిన అరగంట తర్వాత టీ తాగాలనుకుంటే పాలు కలపకుండా తులసి టీ తాగాలి.
తులసి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- ఆయుర్వేదంలో తులసికి ప్రముఖ స్థానం ఉంది. దీనిలోని గుణాల కారణంగానే ఇది దివ్యౌషధంగా ప్రసిద్ధిపొందింది.
- తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు, దగ్గు, జలుబు వంటివి త్వరగా తగ్గేలా తులసి చేస్తుంది.
- తులసిలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నందున దీనిని తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా తులసి ఉపకరిస్తుంది.
- తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున కాబట్టి చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
- తులసిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అవుతుంది.
- తులసిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటన్నింటితో పాటు తులసిలో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి.
- ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మీ రోగనిరోధక శక్తిని కాపాడుకునేందుకు తులసి ఎంతగానో ఉపయోగపుడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..