Tea Side Effects: ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల కలిగే సమస్యలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే అమ్మో అనాల్సిందే..

చలికాలంలో టీ తాగడం వల్ల మనసుకు ఎంతో ఉల్లాసం లభిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న టీని ఎక్కువగా తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య..

Tea Side Effects: ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల కలిగే సమస్యలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే అమ్మో అనాల్సిందే..
Unlimited Consuming Of Tea Will Makes Many Health Problems
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 23, 2022 | 11:18 AM

‘‘మితిమీరితే అమృతం కూడా విషం అవుతుంది’’ అనే సామెతను మీరు వినే ఉంటారు. మీకు రోజూ టీ తాగే అలవాటు ఉంటే మంచిదే. కానీ అది మన ఆహారపు అలవాట్లలో భాగమై పోయి మితిమీరితే మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే రోజుకు 3, 4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అనేక పరిశోధనల్లో నిరూపితమయింది. సాధారణ  జీవన విధానంలో టీ తాగడం చాలా మంచి అలవాటు. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు టీ తాగవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే మితిమీరి టీ తాగకండని కూడా చెబుతున్నారు.

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో టీ ప్రప్రథమ స్థానంలో ఉంటుంది. పాలు, చక్కెరలతో తయారయ్యే టీని భారత్‌లో చాయ్ అని కూడా అంటారు. సాంప్రదాయకంగా  అయితే టీని జ్వరం లేదా జలుబు సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో టీ తాగడం వల్ల మనసుకు ఎంతో ఉల్లాసం లభిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న టీని ఎక్కువగా తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ ప్రతికూలతలు:

1. ఆందోళన, ఒత్తిడి: టీ ఆకులలో కెఫీన్ అనేది ఒక సేంద్రీయ భాగం. టీ ఎక్కువగా తాగడం వల్ల మనం అధిక మొత్తంలో కెఫిన్‌ను తీసుకున్నట్లవుతుంది. ఫలితంగా మనలో భయం, ఆందోళన,  చంచలత వంటి భావాలు తీవ్రతరం అవుతాయి.

ఇవి కూడా చదవండి

2. మలబద్ధకం: టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్ధం మన శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది.

3. గుండెల్లో మంట: టీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు ఎంత టీ తాగితే, మీ కడుపులో అంత ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గుండెల్లో మంట ఏర్పడుతుంది.

4. నిద్రలేమి: మానవ జీవన క్రమంలో నిద్ర చాలా ముఖ్యమైనది. నిద్ర లేకపోవడం అనేది మానవ మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. టీ ఎంత ఎక్కువ తాగితే అంత తక్కువ నిద్ర వస్తుంది. ఈ కారణంగానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు  నిద్ర పట్టకుండా ఉండడానికి టీని ఎక్కువగా తాగుతుంటారు.  

5. గర్భధారణ సమస్యలు: గర్భస్రావం లేదా జన్మించే శిశువు బరువును టీ ప్రభావితం చేస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో టీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..