Ben Stokes IPL 2023 Auction: ధోనికి వారుసుడు దొరికేశాడు.. వరల్డ్‌కప్ విన్నర్‌ను దక్కించుకున్న చెన్నై..
Ben Stokes Auction Price: అనుకున్నట్లుగానే టీ20 వరల్డ్‌కప్ హీరో, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఐపీఎల్ మినీ వేలంలో కాసుల వర్షం కురిసింది. స్టోక్స్ కోసం
Ben Stokes Auction Price: అనుకున్నట్లుగానే టీ20 వరల్డ్‌కప్ హీరో, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఐపీఎల్ మినీ వేలంలో కాసుల వర్షం కురిసింది. స్టోక్స్ కోసం హైదరాబాద్, లక్నో, చెన్నై ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలబడ్డాయి. చివరికి రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున 2019లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వేలంలో తన పేరును నమోదు చేసుకోగా.. ధోని టీం అతడ్ని దక్కించుకుంది.
అటు 2024 ఐపీఎల్‌కు ధోని అందుబాటులో ఉన్నడన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే 15వ ఎడిషన్‌లో జడేజాకు సారధ్య బాధ్యతలు అప్పగించగా.. అది కాస్తా బెడిసికొట్టింది. ఇక ఇప్పుడు మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్‌ను దక్కించుకోవడంతో.. ధోని ఎగ్జిట్ అనంతరం 2024లో చెన్నైకి స్టోక్స్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.
కాగా, స్టోక్స్ ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే.. ఇప్పటిదాకా 43 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో 920 పరుగులు, బంతితో 28 వికెట్లు పడగొట్టాడు.
LION ALERT ?
BEN IS IN! #WhistlePodu #SuperAuction
— Chennai Super Kings (@ChennaiIPL) December 23, 2022