Chanakya Niti: కష్టాలు వచ్చినప్పుడు ముందుగా ఎవరిని రక్షించుకోవాలి.. చాణక్య ఏం చెప్పారంటే..?..
సంక్షోభ సమయాల్లో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, మొదట ఎవరిని రక్షించుకోవాలి. భార్య, సంపద లేదా తనను తాను..? ఇలాంటి అనేక లోతైన ప్రశ్నలకు ఆచార్య చాణక్యుడు ఆసక్తికర సమాధానమిచ్చారు. చాణక్య బోధనలను పాటిస్తే జీవితంలో సక్సెస్ కావచ్చు. కాగా దీనికి సంబంధించి చాణక్య ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి సంబంధించి నిజమైన జ్ఞానం తెలుస్తుంది. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఇలాంటి కఠినమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. సంక్షోభ సమయాల్లో మొదట ఎవరిని రక్షించుకోవాలి.. భార్య, సంపద లేదా తనను తాను? ఈ ప్రశ్నకు చాణక్యుడు ఇచ్చిన సమాధానం నేటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
డబ్బు
చాణక్యుడి ప్రకారం.. సంక్షోభ సమయాల్లో ముందుగా డబ్బును రక్షించుకోవాలి. ఎందుకంటే డబ్బు కేవలం సుఖాలు, విలాసాల కోసం మాత్రమే కాదు.. కష్ట సమయాల్లో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది. డబ్బు లేకపోతే కష్టాల నుండి బయటపడటం దాదాపు అసాధ్యం.
భార్య
భార్య డబ్బు కంటే ముఖ్యమైనదిగా చాణక్యుడు భావించారు. భారతీయ సంస్కృతిలో భార్యను ‘సహధర్మిని’ అని పిలుస్తారు. ఆమె కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు కుటుంబానికి ఒక పునాది. అందుకే డబ్బును రక్షించుకునే ముందు భార్యను రక్షించుకోవడం ధర్మం అని చాణక్యుడు వివరించారు.
అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మరక్షణ
డబ్బు, భార్య కంటే కూడా అత్యంత ముఖ్యమైనది తనను తాను రక్షించుకోవడం. ఒక వ్యక్తి జీవించి ఉంటేనే సంపదను, భార్యను రక్షించుకోగలడు. సంక్షోభంలో ముందుగా తన ప్రాణాన్ని కాపాడుకోవడం తెలివైన పని. ఎందుకంటే ఒకరు జీవించి ఉంటే, భవిష్యత్తులో కుటుంబాన్ని, ఆస్తులను తిరిగి నిర్మించుకోవచ్చు.
చాణక్యుడి ఈ ఆలోచన నేటి జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. జీవితం అనేది గొప్ప సంపద. కష్టాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తనతో పాటు తన కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడుకోగలడు. ఇది డబ్బు, బంధాల మధ్య సమతుల్యతను ఎలా పాటించాలో నేర్పిస్తుంది.
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




