Backache: వెన్నునొప్పి భరించలేకపోతున్నారా? అయితే ఈ వంటింటి చిట్కాలతో డాక్టరుతో పనిలేదు..

ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యలలో వెన్ను నొప్పి ఒకటి. నొప్పి సాధారణంగా లోయర్ బ్యాక్ భాగంలో సంభవిస్తుంది ఒక వ్యక్తి ముందుకు వంగినప్పుడు, నొప్పి పెరుగుతుంది.

Backache: వెన్నునొప్పి భరించలేకపోతున్నారా? అయితే ఈ వంటింటి చిట్కాలతో డాక్టరుతో పనిలేదు..
Backache
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 24, 2023 | 11:46 AM

ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యలలో వెన్ను నొప్పి ఒకటి. నొప్పి సాధారణంగా లోయర్ బ్యాక్ భాగంలో సంభవిస్తుంది ఒక వ్యక్తి ముందుకు వంగినప్పుడు, నొప్పి పెరుగుతుంది. వెనుక కండరాలు బలహీనంగా మృదువుగా ఉండటంతో పాటు, వయసు సంబంధిత మార్పుల వల్ల వచ్చే వెన్నునొప్పి వెన్నెముక నరాల మీద ఒత్తిడి వల్ల కాళ్లకు వ్యాపిస్తుంది. వెన్నునొప్పి సాధారణంగా వెనుక కండరాలలో ఒత్తిడిని సూచిస్తుంది.

వెన్నునొప్పికి అనేక కారణాలు ఉన్నాయి అవి ఒక్కొక్కటి భిన్నంగా ఉంటాయి. వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు మీకు చాలా వరకు సహాయపడతాయి. వెనుక భాగం శరీరం కేంద్ర బిందువు చాలా ముఖ్యమైనది. అయితే వెన్నునొప్పిని వదిలించుకోవడానికి ఈజీ మార్గాలను వెతుకుతున్నట్లయితే, ఇక్కడ మీరు ప్రయత్నించగల కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

వెన్నునొప్పి నుండి బయటపడటానికి ఇంటి చిట్కాలు:

ఐస్ ప్యాక్:

ఇవి కూడా చదవండి

ఐస్ నొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. మీరు దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు. ఇది వాపును కూడా తగ్గిస్తుంది. టవల్‌లో ఐస్‌ ప్యాక్‌ను చుట్టుకుంటే నొప్పిని వెంటనే తగ్గించుకోవచ్చు.

సరైన భంగిమను కూర్చొండి:

చాలా మంది ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తుంటారు. కాబట్టి సరైన భంగిమను నిర్వహించడం చాలా ముఖ్యం. సరిగ్గా కూర్చోవడం వల్ల వీపుపై ఒత్తిడి తగ్గుతుంది. సరైన భంగిమ అంటే అన్ని ఎముకలు సమంగా ఉండాలి. మీ పాదాలు నేలపై చదునుగా ఉంటాయి.

రెగ్యులర్ మసాజ్:

మంచి మసాజ్ వెన్నునొప్పి నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా ఒత్తిడి బస్టర్‌గా కూడా పనిచేస్తుంది. మెరుగైన ఫలితాల కోసం మీరు జండు బామ్, అమృతాంజనం లాంటివి కూడా ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి:

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినండి. మీరు వెల్లుల్లి నూనెతో బ్యాక్ మసాజ్ కూడా చేయవచ్చు. వెల్లులి నూనెతో మీ వీపును సున్నితంగా మసాజ్ చేయండి. కాసేపు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

వెన్నునొప్పిని నివారించడానికి ఉత్తమ మార్గం మీ వెన్ను కండరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. స్ట్రెచింగ్ వ్యాయామాలు వెనుకకు ఉత్తమంగా పని చేస్తాయి.

పాలలో పసుపు తేనె కలపి తాగండి:

పాలలో పసుపు తేనె కలుపుకుని తాగడం వల్ల వెన్నునొప్పి నయమవుతుంది. ఇది బాగా పని చేస్తుంది. ఇది శరీరం కీళ్ల ఇతర నొప్పులను కూడా నయం చేస్తుంది.

వేడి నీటి స్నానం :

వేడినీరు వెన్నుపై పోసుకుంటూ స్నానం చేయండి. ఇది కూడా ఉపశమనం కల్పిస్తుంది.

ఈ చర్యలు తీసుకున్న తర్వాత కూడా మీ నొప్పి తగ్గకపోతే నిరంతరం పెరుగుతూ ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!