కాఫీని జుట్టుకు రాస్తే ఏమౌతుందో తెలుసా..? వాడే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!
ఈ మధ్య చాలా మంది కాఫీ ని జుట్టు సంరక్షణలో భాగంగా వాడుతున్నారు. కాఫీ తాత్కాలికంగా తెల్ల జుట్టు కు కొంచెం గోధుమ రంగు ఇస్తుంది. అలాగే కాఫీలో ఉండే కెఫిన్ తల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుందని సైన్స్ చెబుతోంది.

కాఫీలో ఉండే సహజ రంగులు తాత్కాలికంగా తెల్ల జుట్టుకు బ్రౌన్ షేడ్ ఇస్తాయి. కానీ ఇది చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. శాశ్వత హెయిర్ డైలా దీని ప్రభావం ఉండదు. కెఫిన్ ఉన్న ప్రత్యేక ప్రోడక్ట్స్ జుట్టు పెరుగుదలకు, తల చర్మం రక్త ప్రసరణకు మంచివని సైన్స్ చెబుతోంది. కానీ ఎక్కువగా కాఫీ వాడితే జుట్టు పొడిగా మారవచ్చు. అలర్జీ రావడం చాలా అరుదు.. కానీ వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
తెల్ల జుట్టును కవర్ చేయడం సాధ్యమేనా..?
కాఫీతో తెల్ల జుట్టును పూర్తిగా కవర్ చేయడం సాధ్యం కాదు. కానీ బలమైన కాఫీని కాచి చల్లార్చి జుట్టులో రాసుకుంటే లేదా కండీషనర్‌లో కలిపి వాడితే జుట్టుకు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. దీని వల్ల తెల్ల జుట్టు తాత్కాలికంగా తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే ఇది ఒకటి రెండు సార్లు తలస్నానం చేస్తే పోతుంది. శాశ్వత హెయిర్ డైలా దీని ప్రభావం ఉండదు.
తల చర్మానికి మంచిదేనా..?
ఇది కాఫీ లవర్స్‌కి గుడ్ న్యూస్. సైన్స్ ప్రకారం.. కెఫిన్ తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే DHT అనే హార్మోన్‌ను కాఫీన్ అడ్డుకుంటుంది. దీని వల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా ఉండి.. జుట్టు పెరగడానికి సహాయపడతాయి. కొన్ని పరిశోధనల్లో, కెఫిన్ వాడిన జుట్టులో గ్రోత్ ఎక్కువ రోజులు ఉందని తేలింది. అందుకే మార్కెట్లో ఉన్న కెఫిన్ ఆధారిత సీరమ్‌లు ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి.. కానీ కేవలం కాఫీతో తలస్నానం చేయడం వల్ల అంత ప్రభావం ఉండకపోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధారణంగా కాఫీ చర్మానికి హానికరం కాదు. హెయిర్ డైలాగా దీని వల్ల రియాక్షన్ రాదు. కానీ ఎక్కువగా వాడితే జుట్టు పొడిగా, గట్టిగా మారవచ్చు. తరచూ వాడితే బిల్డ్ అప్ (జుట్టు మీద ఒక పొరలా పేరుకుపోవడం), డ్రై అవ్వడం జరగవచ్చు. చాలా అరుదుగా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చిన్న పాచ్ టెస్ట్ చేయడం మంచిది.
అమెరికా FDA కాఫీని ఆహారంగా మాత్రమే గుర్తించింది. హెయిర్ డైగా కాదు. అలాగే కాఫీతో తలస్నానం చేయడంపై CDC లేదా NIH నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవు. కానీ ఇంట్లో చేసే చిట్కాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఆపడం మంచిది.




