AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulletproof Coffee: బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి? రోజుని ఈ కాఫీతో మొదలు పెట్టడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది అధిక కొవ్వు, తక్కువ కార్బ్ పానీయం. దీనిలో బ్లాక్ కాఫీ,ఉప్పు లేని వెన్న లేదా నెయ్యి లేదా MCT నూనె కలుపుతారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక దృష్టిని పెంచడంలో, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కీటో డైట్‌ని అనుసరించే వ్యక్తులు ఎక్కువగా ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకుంటారు. అయితే దీనిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Bulletproof Coffee: బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి? రోజుని ఈ కాఫీతో మొదలు పెట్టడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
మెదడు స్థిరమైన సంకేతానికి అలవాటు పడినప్పుడు, అది దానిని విస్మరించి ఇతర మరింత స్పష్టమైన మార్పులపై దృష్టి పెడుతుంది. అందుకే అధికంగా తియ్యగా ఉండే పదార్ధాలు తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగినప్పుడు అది అంత తీపిగా రుచించదు. దీంతో మెడదు చేదు రుచి సంకేతాన్ని నాలుకకు పంపుతుంది.
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 6:16 PM

Share

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యం, ఫిట్నెస్ పై శ్రద్ధ ఉన్నవారు .. ముఖ్యంగా కీటో డైట్ పాటించే వ్యక్తులు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఈ కాఫీ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాదు మానసిక దృష్టిని కూడా పెంచుతుంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో రోజును ప్రారంభించడం నిజంగా ప్రయోజనకరంగా ఉందా? ప్రయోజనాలు ఏమిటి ? ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం సరైనదేనా అని తెలుసుకుందాం.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి?

బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది బ్లాక్ కాఫీ , గడ్డితో తయారుచేసిన ఉప్పు లేని వెన్న , MCT (కొబ్బరి నూనె నుండి తీసిన మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ నూనె) నూనె మిశ్రమాన్ని కలిగి ఉన్న ఒక ప్రత్యేక రకమైన కాఫీ. దీనిని నురుగుగా, క్రీముగా చేయడానికి కలుపుతారు. ఇది సాధారణ కాఫీ కంటే రుచికరంగా, పోషకంగా ఉంటుంది. ఇది అడపాదడపా డైట్ చేసేవారి కోసం లేదా కీటో డైట్‌ను అనుసరిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు

తక్షణ శక్తి వనరు – MCT నూనె త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మెదడు పనితీరు మెరుగుపడుతుంది – MCT ఆయిల్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడుకు తక్షణ శక్తిని అందిస్తాయి. దృష్టి , ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది – ఇది కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తుంది. ఎక్కువసేపు మిమ్మల్ని కడుపు నిండి ఉండేలా చేస్తుంది. తద్వారా తీసుకునే కేలరీలను తగ్గిస్తుంది.

ఇన్సులిన్ స్పైక్ నివారణ- ఇందులో కార్బోహైడ్రేట్లు ఉండవు కనుక ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అడపాదడపా డైట్ చేసేవారికి సహాయపడుతుంది- దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి ఆలస్యం అవుతుంది. ఉపవాస సమయాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

రోజును బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో ప్రారంభిస్తున్నారా..!

కీటో డైట్‌లో ఉంటే లేదా అప్పుడప్పుడు డైట్ చేస్తుంటే బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ రోజుని దీనితో ప్రారంభించవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తుంది. అయితే ఎవరికైనా అధిక కార్బ్ డైట్‌లో ఉంటే లేదా కొవ్వులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ప్రతిరోజూ దీనిని తీసుకోవడం హానికరం కావచ్చు.

ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి?

అధిక కొలెస్ట్రాల్ – అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు.

జీర్ణ సంబంధిత సమస్యల విషయంలో – అధిక మొత్తంలో కొవ్వు కొంతమందికి గ్యాస్, ఆమ్లత్వం లేదా కడుపు సమస్యలను కలిగిస్తుంది.

తయారీ విధానం:

సాధారణ పాలు లేకుండా బ్లాక్ బ్రూ కాపీని చేయండి.

ఈ కాఫీని మిక్సీలో వేసి వెన్న లేదా దేశీ నెయ్యి , MCT నూనెని కలిపి నురుగు వచ్చే వరకు గ్రైండ్ చేయండి.

నచ్చిన వారు తేనెను లేదా తాటి బెల్లం వేసుకుని తాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)