AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs: కుక్క ఎప్పుడు దాడి చేస్తుందో తెలుసా..? ఈ విషయాలు తెలిస్తే ఈజీగా తప్పించుకోవచ్చు..

కుక్కల స్వభావం ఎప్పుడూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది. కొన్నిసార్లు అవి చాలా ముద్దుగా, స్నేహపూర్వకంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రవర్తన అకస్మాత్తుగా మారుతుంది. అందువల్ల వాటి మానసిక స్థితి, స్వభావాన్ని ఏ సంకేతాల ద్వారా గుర్తించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Dogs: కుక్క ఎప్పుడు దాడి చేస్తుందో తెలుసా..? ఈ విషయాలు తెలిస్తే ఈజీగా తప్పించుకోవచ్చు..
Dog Warning Signs
Krishna S
|

Updated on: Aug 23, 2025 | 6:20 PM

Share

సాధారణంగా పెంపుడు జంతువులలో కుక్కలు అత్యంత విశ్వాసపాత్రమైనవిగా, స్నేహపూర్వకమైనవిగా పేరు పొందాయి. కానీ కొన్నిసార్లు వాటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టం. ఒక్కోసారి అవి సడెన్‌గా దూకుడుగా మారి కరిచే ప్రమాదం ఉంది. గత కొంత కాలంగా కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. కుక్కల వల్ల ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే కుక్క దాడి చేసే పరిస్థితిని ముందుగానే ఎలా గుర్తించాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దూకుడుకు కారణాలు:

ప్రాంతీయ స్వభావం: కుక్కలు తమ ప్రాంతం పట్ల చాలా ఆధిపత్య భావాన్ని కలిగి ఉంటాయి. వాటి ఇల్లు, వీధి లేదా యార్డ్‌లోకి ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తే అవి వెంటనే అప్రమత్తమై మొరగడం, అరుస్తూ దాడికి సిద్ధమవుతాయి. ఇది తమ స్థలాన్ని రక్షించుకోవడానికి అవి చూపించే సహజ స్వభావం.

ఆహారం: చాలా కుక్కలు తినేటప్పుడు తమ దగ్గరికి ఎవరినీ రానివ్వవు. ఈ సమయంలో వాటి ప్లేట్ నుండి ఏదైనా లాగడానికి ప్రయత్నిస్తే, అవి వెంటనే దాడి చేయవచ్చు.

కుక్క చరిత్ర: కుక్క చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకు ముందు ఆ కుక్క ఎవరినైనా కరిచిందా లేదా అనేది దాని యజమానికి లేదా ఆ ప్రాంత ప్రజలకు తెలిసి ఉంటుంది. ఒకవేళ గతంలో దూకుడుగా ఉన్న రికార్డు ఉంటే, అప్రమత్తంగా ఉండటం మంచిది.

కుక్క ప్రవర్తనలో కనిపించే సంకేతాలు:

లాలాజలం, నోటి కదలికలు: కుక్క నోటి నుండి లాలాజలం కారుతుంటే అది దూకుడుకు సంకేతం కాకపోవచ్చు కానీ అది అనారోగ్యంతో ఉందని లేదా రేబిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగి ఉందని అర్థం. ఈ సమయంలో దాని దంతాలు కనిపిస్తూ, పెదాలు బిగుసుకుపోయి ఉంటే అది ప్రమాదకర పరిస్థితి.

శరీర భాష: కుక్క నడక, శరీర భాష కూడా చాలా సంకేతాలు ఇస్తాయి. నడక వేగంగా, శరీరం బిగుతుగా ఉంటే, తోక నిటారుగా ఉండి, చెవులు వెనక్కి లాగినట్లు ఉంటే అది కోపంగా ఉందని అర్థం. దీనికి విరుద్ధంగా కుక్క స్వేచ్ఛగా నడుస్తూ, తోక ఊపుతూ, శరీరం రిలాక్స్‌గా ఉంటే అది ప్రశాంతంగా ఉన్నట్లు అర్థం.

కుక్క ఎప్పటికీ కరవదని చెప్పలేం

కుక్క ఎప్పటికీ కరవదని నమ్మడం కష్టం అని నిపుణులు అంటున్నారు. అది పెంపుడు కుక్క అయినా, వీధిలో తిరిగే కుక్క అయినా, దాని ప్రవర్తన అనేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. దాని శరీర భాషను గమనించి, అనవసరమైన ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..