AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: మీకు కరోనా సోకిందా.. అప్రమత్తంగా ఉండండి.. మీ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా నుంచి బయటపడినా.. దాని బారిన పడిన వారి ఆరోగ్యంపై తీవ్ర హానిని కలిగిస్తుందని అధ్యయనాలు నిర్ధారించాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇన్ఫెక్షన్ సమయంలో తీవ్రమైన సమస్యలు కలిగాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వ్యక్తులలో ఈ కరోనా దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగిస్తుందని.. వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో సర్వత్రా ఆందోళనలు తలెత్తాయి.

Covid 19: మీకు కరోనా సోకిందా.. అప్రమత్తంగా ఉండండి.. మీ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
Post Covid Health Issues
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 7:12 PM

Share

కరోనా సృస్టించిన అల్లకల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సోకిన వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనావైరస్ ఇన్ఫెక్షన్ గుండె ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం వరకు కొనసాగే పోస్ట్ కోవిడ్ లక్షణాల గురించి కూడా హెచ్చరికలను జారే చేశారు.

కరోనా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇటీవల జరిపిన అధ్యయనంలో.. శాస్త్రవేత్తల బృందం మరో పెద్ద విషయాన్ని వెల్లడించింది. కరోనా బాధితుల రక్త నాళాలను కూడా దెబ్బతీసిందని పరిశోధకులు తెలిపారు. కోవిడ్-19.. వ్యాధి రక్త నాళాలను దాదాపు 5 సంవత్సరాలు వృద్ధాప్యంలోకి నెట్టేసిందని చెబుతున్నారు. రక్త నాళాలపై కనిపించే ఈ ప్రభావాలు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఈ దుష్ప్రభావాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రక్త నాళాలను వృద్ధాప్యానికి గురి చేస్తున్న కరోనా ఇన్ఫెక్షన్

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనం ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ సిటీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ పరిశోధన ప్రధాన రచయిత్రి రోజా, బ్రూనో మాట్లాడుతూ.. ఈ మహమ్మారి COVID-19 సోకిన చాలా మందికి నెలలు లేదా సంవత్సరాల పాటు అనేక లక్షణాలు ఉండవచ్చని మేము చేసిన పరిశోధనల ద్వారా తెలిసిందని చెప్పారు. అయితే ఈ సమస్యలు ఎందుకు కొనసాగుతాయి.. శరీరంలో ఏ మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మేము ఇంకా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తల బృందం.. ఈ ఇన్ఫెక్షన్ మానవుల రక్త నాళాలను వారి వయస్సు కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువగా వృద్ధాప్యం చేసిందని కనుగొంది. ఈ రకమైన సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపించింది.

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు శ్వాస ఆడకపోవడం, అలసట వంటి కోవిడ్ అనంతర లక్షణాలు కనిపిస్తున్న మహిళల రక్త నాళాలలో ఇటువంటి మార్పులను ఎక్కువగా గమనించామని నిపుణులు తెలిపారు.

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ , యూరప్‌తో సహా 16 దేశాల నుంచి సుమారు 2,400 మంది పాల్గొన్నారు.. వీరిలో సగం మంది మహిళలున్నారు. వయస్సుతో పాటు రక్త నాళాలు సహజంగా గట్టిపడతాయని పరిశోధకులు తెలిపారు. అయితే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. దీని ఫలితంగా స్ట్రోక్ , గుండెపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా పెరిగింది.

అధ్యయనం ఏమి కనుగొందంటే

సగటున తేలికపాటి ఇన్ఫెక్షన్ ఉన్న మహిళల్లో పల్స్ వేవ్ వేగం (PWV) సెకనుకు 0.55 మీటర్లు.. ఆసుపత్రిలో చేరిన మహిళల్లో 0.60 మీటర్లు … తీవ్రమైన వ్యాధుల కారణంగా ICUలో చికిత్స పొందుతున్న మహిళల్లో సెకనుకు ఒక మీటర్ కంటే ఎక్కువ ఉందని అధ్యయనం కనుగొంది. పల్స్ వేవ్ వేగం అనేది ధమనుల గుండా తరంగాలు వెళ్ళే వేగాన్ని సూచిస్తుంది. ఇది ధమనుల దృఢత్వానికి ప్రధాన సూచికగా పరిగణించబడుతుంది. అధిక స్థాయి PWV ధమనుల దృఢత్వాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితి అధిక రక్తపోటు,మధుమేహం వంటి సమస్యలను కూడా పెంచుతుంది. కరోనా బారిన పడిన పురుషులతో పోలిస్తే మహిళల్లో పల్స్ వేవ్ వేగంలో గణనీయమైన వ్యత్యాసం ఉందని రచయితలు తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి ముప్పు తీవ్రత ఇప్పుడు తగ్గినప్పటికీ.. కోవిడ్-19 తర్వాత వస్తున్న సమస్యలు ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగా ఉన్నాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు తెలిపారు. కోవిడ్-19 మన ధమనులను వృద్ధాప్యం చేసింది. ఇది గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణం కావచ్చు. దీనికి సంబంధించిన ఓపెన్ ఫోరం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించబడిన మరొక అధ్యయనంలో, కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత.. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒక సంవత్సరం తర్వాత ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయని పరిశోధకులు నివేదించారు. ప్రజలు శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన అలసట-బలహీనత, తలనొప్పి, ఒత్తిడి-ఆందోళన వంటి దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలను కలిగి ఉండవచ్చని చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..