AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boiled Eggs: ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? చెడిపోకుండా ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోండి!

గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే.. వీటిలో ఉండే ప్రొటీన్, విటమిన్‌లు, ఖనిజాలు మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మన ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే చాలా మంది డాక్టర్స్ కూడా ఎగ్స్ తినమని రెఫర్ చేస్తారు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఏమిటంటే.. ఉడికించిన గుడ్డును ఎంత సమయం వరకు తినవచ్చు.. రాత్రి ఉండికించిన గుడ్డును ఉదయం తినవచ్చా అని.. మీ ఈ డౌట్ ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి.

Boiled Eggs: ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? చెడిపోకుండా ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోండి!
Boiled Egg Storage
Anand T
|

Updated on: Jan 11, 2026 | 7:18 AM

Share

గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. గుడ్లు అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. ఉడికించిన గుడ్లలో సుమారు 70 నుండి 80 కేలరీలు, 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, వాటిలో విటమిన్లు డి, బి 12, ఐరన్, జింక్, సెలీనియం, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. అయితే, చాలా మంది ఉదయం గుడ్లు ఉడకబెట్టి రాత్రి లేదా మరుసటి రోజు తినడం మంచిదేనా అనే డౌట్‌లో ఉన్నారు. కాబట్టి ఉడికించిన గుడ్డును ఎన్ని రోజులు నిల్వ ఉంచి తినవచ్చు? అవి ఎప్పుడు చెడిపోతాయి? అనేది తెలుసుకుందాం.

ఉడికించిన గుడ్లను ఎంతసేపులోపు తినవచ్చు?

నిజానికి సరిగ్గా ఉడికించిన గుడ్లను ప్రిజ్‌లో 7 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. అంటే ఉడికించిన గుడ్లను తొక్క తీసినా, తీయక పోయినా అది సురక్షితంగా ఉంటుంది. కానీ మీరు దాని పూర్తి రుచి, ప్రయోజనాలు పొందాలనుకుంటే ఒకటి, రెండ్రోజుల్లోపే తినేయడం బెటర్. ఉన్నా లేదా తొక్క తీసినా సురక్షితంగా తినవచ్చు. అయితే సగం ఉడికించిన లేదా మెత్తగా ఉడికించిన గుడ్లు ఉంటే వాటిని వెంటనే తినడం మంచిది.

ఎక్కువ సమయం బయట ఉంచకండి

ఉడికించిన గుడ్లను ఎక్కువసేపు బయట ఉంచడం పెద్ద తప్పు. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత, వెంటనే వాటిని చల్లటి నీటిలో వేయండి. దీనివల్ల అవి త్వరగా చల్లబడతాయి. దీని తర్వాత, వాటిని 2 గంటల్లోపు ప్రిజ్‌లో ఉంచండి. బయట ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే, మీరు గుడ్లను గంటలోపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అప్పుడే బ్యాక్టీరియా పెరగదు.

ప్రిజ్‌లో గుడ్లను ఎక్కడ నిల్వ చేయడం సురక్షితం?

ఉడికించిన గుడ్ల తొక్క తీయడం సురక్షితమని చాలా మంది అనుకుంటారు. అయితే, ఈ పద్ధతి సరైనది కాదు. గుడ్లను వాటి పెంకులతో నిల్వ చేయడం చాలా సురక్షితం. ఎందుకంటే పెంకు అనేది గుడ్డుకు సహజ రక్షణ పొరగా పనిచేస్తుంది. ఇది గుడ్లను రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే వాసనలు, హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది.

చాలా మంది గుడ్లను ప్రిజ్‌ డోర్‌కు ఉన్న కంటైనర్స్‌లో ఉంచుతారు. కానీ అక్కడ పెట్టడం సురక్షితం కాదు. ఎందుకంటే డోర్ తెరిచినప్పుడు ఉష్ణోగ్రతలు పదేపదే మారుతాయి. దీనివల్ల గుడ్లు త్వరగా చెడిపోతాయి. అది ఉడికించిన గుడ్లు అయినా లేదా సాధారణ గుడ్లు అయినా. కాబట్టి మీరు వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. ఇది గుడ్లను తేమ నుండి రక్షిస్తుంది. అలాగే గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేదుకు సహాయపడుతుంది.

చెడు గుడ్లను గుర్తించడం

మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన వాటిలో చెడు గుడ్లను గుర్తించడం చాలా ముఖ్యం. దీనివల్ల మనం ఆరోగ్య సమస్యల భారీన పడకుండా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డులో బలమైన వాసన లేదా కుళ్ళిన వాసన ఉంటే, వెంటనే దాన్ని పారవేయండి. అలాంటి గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఉడికించడానికి ముందే గుడ్డు మంచిదా కాదా తెలుసుకోండి. ఇందుకు గుడ్లను నీటిలో వేసి ఉంచి పరీక్షించండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
AP SET 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. చలికాలంలో ఈ పండ్లు తింటే ఈజీగా బరువు..
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
EV బ్యాటరీ ప్యాక్‌లపై ఆధార్‌ నంబర్‌ ఎందుకంత ముఖ్యం!
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
విగ్రహం కింద గుప్త నిధుల ఉన్నాయంటూ తవ్వకాలు.. తీరా తీసి చూస్తే..
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!