Sleeping Tips: వావ్.. ఇన్నర్స్ లేకుండా పడుకుంటే ఇన్ని ప్రయోజనాలా..! తెలిస్తే వెంటనే పాటిస్తారు!
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలలో నిద్రలేమి కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ప్రజలు మరిన్న అనారోగ్య సమ్యలను ఎదుర్కొవలసి వస్తుంది. జనాలు తరచూ ఈ వ్యాధి బారీన పడేందకు జీవన శైలి ముఖ్య కారణం. కాబట్టి ఈ సమస్య భారీన పడకుండా ఉండే మన జీవనశైలితో కొన్ని మార్పులు చేసుకోవాలి.. ఉత్తమమైన నిద్రను పొందండానికి అలవాట్లను మార్చుకోవాలి.

నిద్ర లేమి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యగా మారింది, ప్రతి ఏటా లక్షలాది మంది జనాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తగినంత నిద్ర లేకపోవడం రోజువారీ శక్తి స్థాయిలు, మానసిక స్థితిని ప్రభావితం అవ్వడమే కాకుండా, స్థూలకాయం, మధుమేహం, హార్ట్‌ఎటాక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాంలో మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మనం ఈ సమస్య బారీన పడకుండా ఉండేందుకు ఉత్తమైన నిద్రను పొందే మార్గాలను అన్వేషించాలి. నిపులణుల ప్రకారం.. ఇన్నర్స్ లేకుండా నిద్రపోవడం వలన ఈ సమస్యను మనం దూరం చేసుకోవచ్చట. అదెనాలో ఇక్కడ తెలుసుకుందాం
ఇన్నర్స్ లేకుండా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇన్నర్స్ లేకుండా పడుకోవడం వల్ల జననేంద్రియాలకు గాలి చక్కగా తగులుతుంది.. తద్వారా ఆ ప్రదేశంలో వెచ్చదనం, తేమ పెరుగుదలను తగ్గుతుంది. అలా కాకుండా ఇన్నర్ ధరించి పడుకుంటే.. ఆ ప్రదేశంలో తేమ, బ్యాక్టీరియా, ఈస్ట్ వృద్ధి చెందుతుంది. ఇది దీర్ఘకాలంలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు (UTIలు), ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఇన్నర్ లేకుండా పడుకుంటే.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
చర్మపు చికాకు తగ్గింది
టైట్‌గా ఉన్న ఇన్నర్స్ వేసుకొని పడుకోవడం ద్వారా అవి చర్మానికి రాసుకుపోయి ఎరుపు, దద్దుర్లు లేదా చిట్లడం వంటివి ఏర్పడతాయి. కాబట్టి ఇన్నర్స్ లేకుండా నిద్రపోవడం లేదా లూజ్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల ఈ చికాకు తగ్గుతుంది, దీనివల్ల చర్మం సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
మెరుగైన సౌకర్యం, నిద్ర నాణ్యత
ఇన్నర్స్ లేకుండా నిద్రపోవడం ద్వారా స్వేచ్ఛ, విశ్రాంతి అనుభూతి కలుగుతుంది. ఇలా పడుకోవడం ద్వారా శరీరం సహజంగా చల్లబడుతుంది. అలాగే ఇది మీకు నాణ్యమైన నిద్రకు సహాయపడుతుంది. మీరు ఎక్కువ సేపు నిద్రపోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు రాత్రిపూట అసౌకర్యాన్ని తగ్గిస్తుంది, చర్మపు చికాకును తగ్గిస్తుంది.తరచుగా నిద్రకు అంతరాయం కలిగించే ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇన్నర్ ధరించకుండా పడుకోవడం అందరికీ ప్రయోజనం కాదు
ఇన్నర్స్ లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అది అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. సున్నితమైన చర్మం లేదా అలెర్జీలు ఉన్నవారు వారి చర్మం పడుకున్నప్పుడు.. వారి చర్మం పరుపునకు తగులుతుంది. అప్పుడు వారికి చికాగు, ఇంబ్బంది కలగవచ్చు. అలాగే చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు వారికి అసౌకర్యంగా కూడా అనిపించవ్చు. కాబట్టి మీరు ఇన్నర్స్ ధరించినా ధరించకపోయినా, గాలి వెళ్లేందుకు వీలుగా ఉన్నా, తేమను గ్రహించే కాటన్ దుస్తువులను ధరించడం మంచిది. ఇలా చేయడం ద్వారా వ్యక్తిగత సౌకర్యం, విశ్రాంతి, నాణ్యమైన నిద్రను పొందచ్చు.
నిద్ర నాణ్యతను పెంచే ఇతర అలవాట్లు
- స్లీప్‌వేర్‌తో పాటు, అనేక అలవాట్లు మన నిద్ర నాణ్యతను పెంచుతాయి
- రోజు పడుకోవడానికి ఒక కచ్చితమైన సమయాన్ని మీరు సెట్‌చేసుకొండి.. దాన్ని షెడ్యూల్ చేసి పెట్టుకోండి. రోజూ అదే సమయానికి నిద్రపోండి.
- ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం శరీర అంతర్గత గడియారాన్ని నియంత్రిస్తుంది.
- అలాగే మీ నిద్రకు అనుకూలంగా ఉండే వాతావారణాన్ని ఎంచుకోండి
- మీరు ప్రశాంతమైన నిద్రను పొందేందుకు మీ బెడ్‌రూమ్‌లను చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉంచుకోండి.
- మీరు మంచి నిద్రను పొందాలంటే.. పడుకునే గంట ముందే ఫోన్, టీవీ, ట్యాప్‌టాప్‌ను పక్కన పెట్టండి.
- మీరు నిద్రపోవడంలో తరచూ సమస్య ఎదుర్కొంటుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




