బెల్లీ ఫ్యాట్‌తో బేజారవుతున్నారా..? కొవ్వు కరిగి నాజుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..!

పొట్టలో కొవ్వును పోగొట్టడం, అధిక బరువుతో మారిపోయిన శరీర నిర్మాణాన్ని తిరిగి పొందడం అంత సులభం కాదని మనందరికీ తెలిసిందే. అయితే, ఈ పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు వీటన్నింటిని ప్రయత్నించినా ఫలితం లేకుంటే చింతించకండి. కొన్ని చిన్న అలవాట్లను అనుసరించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

బెల్లీ ఫ్యాట్‌తో బేజారవుతున్నారా..? కొవ్వు కరిగి నాజుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..!
Follow us

|

Updated on: Mar 30, 2023 | 5:02 PM

బెల్లీ ఫ్యాట్: ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పొట్టలో కొవ్వును పోగొట్టడం, అధిక బరువుతో మారిపోయిన శరీర నిర్మాణాన్ని తిరిగి పొందడం అంత సులభం కాదని మనందరికీ తెలిసిందే. అయితే, ఈ పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు వీటన్నింటిని ప్రయత్నించినా ఫలితం లేకుంటే చింతించకండి. కొన్ని చిన్న అలవాట్లను అనుసరించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగని ఈ అలవాట్లను పాటిస్తే చాలా తేలికగా ఫలితాలు కనిపిస్తాయని చెప్పలేం కానీ.. రోజువారీ కార్యకలాపంగా చేసుకుంటే కచ్చితంగా ఫలితాలు చూస్తారు.

పొట్ట తగ్గాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1. వేడి నీటిని తాగటం అలవాటు చేసుకోవాలి.. ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగటం చాలా అవసరం. కానీ, వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జలుబు వంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకుంటే, అది మీ జీర్ణవ్యవస్థను కూడా సులభతరం చేస్తుంది. రెండు వారాల్లో మీ శరీరంలో వేడి నీటి వల్ల కలిగే మార్పును మీరు గమనిస్తారు.

2. ఉప్పు, పంచదార వంటి తెల్లని పదార్థాల వినియోగాన్ని తగ్గించండి .. చక్కెర, ఉప్పు రెండు శరీరానికి చాలా హాని కలిగించే పదార్థాలు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతారు. ఉప్పులో ఉండే సోడియం ఊబకాయానికి కారణమవుతుంది. చక్కెర ఆహారాలు కాకుండా, ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ఊబకాయానికి దోహదం చేస్తుందని అనేక అధ్యయనల ద్వారా తేలింది.

ఇవి కూడా చదవండి

3. తరచుగా ఏదైనా తినే అలవాటు మానేయండి.. ఆకలి లేకపోయినా తరచూ ఏదైనా తినడం కొందరికి అలవాటు. అయితే ఏదైనా తినాలని అనిపించినప్పుడు నీళ్లు తాగండి, నీళ్లు తాగిన తర్వాత ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే తినండి.

4. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినండి .. డైటరీ ఫైబర్ మీ జీర్ణక్రియను సక్రమంగా నడుపుతుంది. తద్వారా ఊబకాయాన్ని నివారిస్తుంది. ఎసిడిటీ కూడా అదుపులో ఉంటుంది. కాబట్టి, ఖచ్చితంగా ఫైబర్ పుష్కలంగా తినండి. పిండి ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఊబకాయాన్ని పెంచడంలో సహాయపడే వాటిలో పిండి ఒకటి.

5. వ్యాయామం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బెల్లీ ఫ్యాట్‌ను పోగొట్టుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. మీ నడుము, పొత్తికడుపుపై​దృష్టి సారించే వ్యాయామాలను ఎంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో