- Telugu News Lifestyle Food Experts say that if you eat the leftover rice in the morning, you will get health problems
Health: రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తినడం మనలో చాలా మంది చేసే పనే. అయితే ఇలా రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి..
Updated on: Mar 30, 2023 | 4:58 PM

ఇంట్లో రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తినడం సర్వసాధారణమైన విషయమై. దాదాపు అందరు ఇదే పని చేస్తుంటారు. అయితే మిగిలిన అన్నాన్ని ఫ్రైడ్ రైస్ చేసుకోవడడమో, పులిహోరలా చేసి తింటుంటారు.

అయితే ఇలా రాత్రి మిగిలిన ఆహారం ఉదయం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? తాజాగా ఇదే విషయమై నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లండ్ ఓ నివేదికను వెలువరించింది.

ఇందులో పాల్గొన్న నిపుణుల ప్రకారం రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తినడం అంత మంచిది కాదని తెలపారు. బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియాగా మారుతుందని పరిశోధకులు తెలిపారు.

ఇలా బ్యాక్టీరియా చేరిన ఆహారాన్ని తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదని సూచిస్తారు.

వీలైనంత వరకు అన్నం వండి తర్వాత రెండు గంటల్లోపు తినేయాలి. లేదంటే కచ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. అయితే ఫ్రిజ్‌లో కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఉంచితే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. ఇక అప్పటికే వండిన అన్నాన్ని ఒక్కసారికంటే ఎక్కువసార్లు వేడి చేసినా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.





























