Eyebrows Tips: ఐబ్రో షేప్ చేసేటప్పుడు ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? కొంచెం చూసుకోండి మరీ..
ముఖంతో పాటు, కనుబొమ్మలను కూడా తీరైన రీతిలో అందంగా తీర్చిదిద్దితే చూడముచ్చటగా ఉంటారు. నిజానికి, కనుబొమ్మల ఆకారం అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకున్నట్లే, ఈ కనుబొమ్మలను చక్కగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కనుబొమ్మలను ఎప్పటికప్పుడు అందంగా కనిపించేలా..

మగువలు అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా ముఖ సౌందర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖంతో పాటు, కనుబొమ్మలను కూడా తీరైన రీతిలో అందంగా తీర్చిదిద్దుతారు. నిజానికి, కనుబొమ్మల ఆకారం అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకున్నట్లే, ఈ కనుబొమ్మలను చక్కగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కనుబొమ్మలను ఎప్పటికప్పుడు అందంగా కనిపించేలా చేయడం వల్ల అందం చెక్కుచెదరకుండా కుందనపు బొమ్మలా కనిపిస్తారు. కనుబొమ్మలలో అనవసరంగా పెరిగిన వెంట్రుకలను కత్తిరించడం ద్వారా ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చు. అందుకు బ్యూటీపార్లర్‌లలో నిపుణుల సందర్శించడం ద్వారా కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. కొందరు ఇంట్లోనే స్వయంగా కనుబొమ్మలను చక్కగా ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు కనుబొమ్మలను కత్తిరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎలా కత్తిరించాలంటే..
- ముందుగా, ఒక స్పూలీ బ్రష్ తీసుకొని కనుబొమ్మల వెంట్రుకలను పైకి దువ్వాలి. చాలా పొడవుగా, ఆకారంలో లేని వెంట్రుకలను కత్తెరతో జాగ్రత్తగా కత్తిరించాలి.
- ఆ తర్వాత కనుబొమ్మల సహజ ఆకారాన్ని ఐబ్రో పెన్సిల్ ఉపయోగించి ఒక లైన్ తో గుర్తించాలి. ఇప్పుడు ఆ ఆకారం వెలుపల ఉన్న వెంట్రుకలను కత్తిరించడానికి ప్లకర్ ఉపయోగించాలి. కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ రేఖ వెలుపల ఉన్న వెంట్రుకలను మాత్రమే కత్తిరించాలి. లేకపోతే, ఆకారం పాడైపోయి మంచి షేప్ రాదు. దీంతో కనుబొమ్మలు వింతగా కనిపించవచ్చు.
- కత్తిరించిన తర్వాత, కొద్దిగా తడిగా ఉన్న కాటన్ బాల్ తీసుకొని కనుబొమ్మ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. తరువాత అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ రాయాలి. తద్వారా చర్మం మృదువుగా, చికాకు లేకుండా ఉంటుంది.
- ఇలా చేసిన తర్వాత, జుట్టు పెరిగిన దిశ నుంచి వెనక్కి దువ్వాలి. ఇది కనుబొమ్మ తుది ఆకారాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ జుట్టు పెరుగుదల దిశలోనే లాగాలి. ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది.
కనుబొమ్మల జుట్టును కత్తిరించుకోవాలనుకుంటే, అమెజాన్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఐబ్రో ట్రిమ్మర్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిని మీరు తక్కువ ధరకు కూడా పొందవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








