AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెట్రోల్ బంక్‌ వర్కర్‌కి గన్‌ గురిపెట్టిన యువతి.. ఆ తర్వాత జరిగిందిదే? వీడియో వైరల్..

గ్యాస్ స్టేషన్‌కి ఆయిల్‌ ఫిల్‌ చేయించడానికి వెళ్లిన ఓ కుటుంబం హల్ చల్ చేసింది. అక్కడి సిబ్బంది భద్రత దృష్ట్యా కారులోని వారిని కిందికి దిగాలని కోరడం తప్పైంది. దీంతో వారు నిరాకరించడంతో.. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే అదే కారులోని ఓ యువతి కారు దిగి.. హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి గన్‌ తీసి, నేరుగా పెట్రోల్ బంక్ సిబ్బంది ఛాతిపై గురిపెట్టింది. నకరాల్ చేస్తే.. నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల్చేస్తానని బెదిరించింది..

Viral Video: పెట్రోల్ బంక్‌ వర్కర్‌కి గన్‌ గురిపెట్టిన యువతి.. ఆ తర్వాత జరిగిందిదే? వీడియో వైరల్..
Woman Points Revolver At Gas Station Worker
Srilakshmi C
|

Updated on: Jun 20, 2025 | 6:13 AM

Share

లక్నో, జూన్‌ 20: ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి కారులో గ్యాస్ స్టేషన్‌కి ఆయిల్‌ ఫిల్‌ చేయించడానికి వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది భద్రత దృష్ట్యా కారులోని వారిని కిందికి దిగాలని కోరారు. దీంతో అతడు నిరాకరించడంతో.. సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే కారులోని ఓ యువతి కారు దిగి.. హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి గన్‌ తీసి, నేరుగా పెట్రోల్ బంక్ సిబ్బంది ఛాతిపై గురిపెట్టింది. నకరాల్ చేస్తే.. నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల్చేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు గ్యాస్‌ స్టేషన్‌లోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్‌లో ఆదివారం సాయంత్రం (జూన్‌ 15) ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్‌లో సీఎన్‌జీ పెట్రోల్ బంక్‌కి ఆదివారం (జూన్‌ 15) సాయంత్రం ఓ కారు వచ్చింది. కారులో ఎహ్సాన్ ఖాన్ అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఆయిల్‌ ఫిల్‌ చేస్తున్న రజనీష్ కుమార్‌ అనే వర్కర్‌ భద్రత దృష్ట్యా కారులో ఉన్న వారిని బయటకు రావాలని సూచించాడు. దీంతో కారు దిగడానికి నిరాకరించిన ఎహ్సాన్ ఖాన్.. రజనీష్ కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో రజనీస్‌ కాస్త దురుసుగా ప్రవర్తించడంతో అయితే అదే కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ కూతురు అరిబాకు పట్టరాని కోపం వచ్చింది. అంతే రుసరుసా కారు దిగి, హ్యాండ్‌ బ్యాగ్‌లో నుంచి రివాల్వర్‌ తీసి రజనీష్‌ కుమార్‌ ఛాతిపై గురి పెట్టింది. ఇట్నీ గోలియాన్ మారుగి కి ఘర్ వాలే పెహ్చాన్ నహీ పాయేగే (నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లతో కాల్చిపారేస్తా..) అంటూ బెదిరించింది.

ఇవి కూడా చదవండి

దీంతో బంకులోని ఇతర సిబ్బంది జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి సర్దుమనిగింది. అరిబా తల్లి ఆమెను తిరిగి కారులోకి తీసుకువెళ్లింది. అనంతరం ఆ కుటుంబం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై గ్యాస్‌ స్టేషన్‌ సిబ్బంది రజనీష్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్‌ బంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు రజనీష్ కుమార్ ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎహ్సాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్‌ అయిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.