Iran: ఇరాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.. అవి ఏంటంటే.?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం గురించి వినే ఉంటారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో వందల మందికి పైగా ఇరానియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ సైతం ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. కానీ ఇరాన్‌తో పోలిస్తే ఈ నష్టం చాలా తక్కువ. ఈ తరుణంలో ఇరాన్ గురించి తెలియని కొన్ని విషయాలు ఎంటో తెలుసుకుందాం.
Updated on: Jun 26, 2025 | 2:00 PM

ఇరాన్‌ను గతంలో "పర్షియా" అని పిలిచేవారు. ఈ పేరు 1935లో "ఇరాన్"గా మార్చారు. అంటే "ఆర్యుల భూమి". ఈ దేశం ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. 7,000 సంవత్సరాల పురాతన మానవ నివాసాల అవశేషాలను గుర్తించారు.

ఇరాన్‌లో మహిళలకు ప్రత్యేక దుస్తుల నియమావళి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. తల కప్పుకోకుండా బయటకు వెళ్లడం చట్టం ప్రకారం నేరం. ఇది పాటించకుంటే శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన నాల్గవ అతిపెద్ద దేశం. దీని పరిమాణం 157.8 బిలియన్ బ్యారెళ్లు. ఈ ముడి చమురు మార్కెట్ విలువ దాదాపు 12 ట్రిలియన్ డాలర్లు. ఇరాన్ బంగారు నిల్వ, చమురు ఇరాన్‌కు అతిపెద్ద ఆదాయ వనరు. దీని ఆధారంగా ఇరాన్ బలమైన బంగారు నిల్వ 320 మెట్రిక్ టన్నులు.

మనం దేశం సహా ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లు మెక్‌డొనాల్డ్స్, KFC ఇరాన్‌లో నిషేధం. కానీ మీరు అక్కడ "మాష్ డోనాల్డ్స్" లేదా "ZFC" వంటి నకిలీ బ్రాండ్‌లు చూడవచ్చు. ప్రజలు కూడా వీటినే తింటారు.

ఇరాన్‌లో మద్యం పూర్తిగా నిషేధం. ఇరాన్‌లో మద్యం తాగడం లేదా అమ్మడం చట్టబద్ధమైన నేరం, అయినప్పటికీ కొంతమంది దానిని బ్లాక్ మార్కెట్ ద్వారా సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్ తయారీకి సంబంధించిన ఆధారాలు ఇక్కడ లభించాయి. శాస్త్రవేత్తలు ఇరాన్‌లో 7,000 సంవత్సరాల నాటి వైన్ తయారీ పద్ధతుల అవశేషాలను కనుగొన్నారు. ఇది ప్రపంచంలోని పురాతన వైన్ సంప్రదాయంగా మారింది.

చాహర్ శంబే సూరిని హోలీ లాగానే జరుపుకుంటారు. ఇరాన్‌లో "చాహర్ శంబే సూరి" అనే పండుగ ఉంది, దీనిలో ప్రజలు నిప్పు మీద దూకుతారు. ఇది హోలీని పోలి ఉంటుంది. కొత్త సంవత్సరానికి ముందు జరుపుకుంటారు. పర్షియన్ భాష మాధుర్యం ఇరాన్ అధికారిక భాష పర్షియన్, ఇది సాహిత్యం, కవిత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ కవులు ఒమర్ ఖయ్యామ్, హఫీజ్ ఇక్కడి నుండి వచ్చారు.




