AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతికి 22 సార్లు కత్తిపోట్లు.. బ్రెస్ట్‌ ఇంప్లాంట్లతో బతికిపోయింది!

షాపింగ్ మాల్ పార్కింగ్ ప్రాంతంలో ఓ యువతి కారు ఎక్కుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆమె వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. బ్యాంక్ ఖాతా ఖాళీగా ఉండటం చూసి ఆమెను తన స్నేహితుల నుంచి డబ్బు అప్పుగా తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో కత్తితో ఏకంగా 22 సార్లు యువతిని పొడిచాడు. ఆ తర్వాత..

యువతికి 22 సార్లు కత్తిపోట్లు.. బ్రెస్ట్‌ ఇంప్లాంట్లతో బతికిపోయింది!
China Woman Miraculously Survived
Srilakshmi C
|

Updated on: Jun 20, 2025 | 5:39 AM

Share

ఓ మహిళను గుర్తు తెలియని దుండగుడు 22 సార్లు కత్తితో పొడిచాడు. అయినా అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. బ్రెస్ట్‌ ఇంప్లాంట్ల కారణంగా ఆమె కత్తి పోట్ల నుంచి ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) తెలిపిన వివరాల ప్రకారం..

మే 22న ఆగ్నేయ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని ది మిక్స్‌సి షాపింగ్ మాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షాపింగ్‌ మాల్‌ బయట 30 ఏళ్ల మహిళ కారు ఎక్కుతుండగా.. మెరుపుదాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా ముందు సీటులోకి వచ్చి, పార్కింగ్‌ రుసుం చెల్లించాలని, మాల్‌ నుంచి తనను బయటకు తీసుకెళ్లాలని బెదిరించాడు. కాపాడాలని సదరు మహిళ కేకలు వేసినప్పటికీ.. చూట్టుఉన్న జనం చోద్యం చూస్తున్నారుతప్ప ఎవరూ పట్టించుకోలేదు. కారులో వెళ్తుండగా బాధిత మహిళ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను ఆ వ్యక్తి చెక్‌ చేసి, ఆమె తన స్నేహితుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఇద్దరూ కారులో వెళ్తుండగా బాధితురాలు దుండగుడిని ఏమార్చి తన బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్ చేసింది. దీంతో అతడు ఆమె మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేసి, పోలీసులను అప్రమత్తం చేశాడు.

టోంగ్జియాంగ్‌లోని చోంగ్‌ఫు స్టేషన్ నుంచి పోలీసులు ఆ కారు వద్దకు చేరుకునేలోపు సదరు వ్యక్తి అకస్మాత్తుగా మహిళపై కత్తితో దాడి చేశాడు. ఆమె ఛాతిపై ఏకంగా 22 సార్లు పొడిచాడు. అనంతరం ఆ కత్తితో తనను తాను పొడుచుకుని మృతి చెందాడు. అయితే అన్ని కత్తిపోట్లకు గురైనప్పటికీ బాధిత మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమె గతంలో చేయించుకున్న బ్రెస్ట్‌ ఇంప్లాంట్లు కత్తి పోట్ల గాయాల నుంచి ఆమె ప్రాణాలను కాపాడాయి. అయితే ఓ కత్తిపోటు గాయం మాత్రం ఊపిరితిత్తులకు తాకినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించారు. అయితే ఆమెపై దాడి చేసిన వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు కేసు క్లోజ్‌ చేశారు. దీంతో ఆ మహిళ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక 22 సార్లు కత్తిపోట్లకు గురై బతికి బట్టకట్టగలిగిన సదరు మహిళకు చెందిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెస్ట్‌ ఇంప్లాంట్లతో ఇలాంటి ప్రయోజనం కూడా ఉన్నాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.