భారత్ భవిష్యత్ మారబోతుందా? విదేశాలకు వెళ్లేవారి కంటే మన దేశానికి వచ్చేవారు పెరుగుతారా?
ఉద్యోగాలు చేయం.. తమను ఉండనిస్తే చాలంటున్నారు అమెరికాలోని వలసదారులు. అక్రమంగా వలస వెళ్లిన వాళ్లని ఎలాగూ వదలడం లేదు ట్రంప్. అన్ని డాక్యుమెంట్లతో వెళ్లినా సరే.. ఏదో ఒక తప్పు చూపించి పంపించేస్తున్నారు. ఇదే కొంత ఆందోళనకరంగా ఉంది. ఇక.. కొత్తగా వీసాల కోసం అప్లై చేస్తున్న వారికైతే చుక్కలు చూపిస్తున్నారు. అమెరికానే కాదు యూరప్ కూడా వీసాలను రిజెక్ట్ చేస్తూ జాగ్రత్తపడుతున్నాయి. ఆ పరిస్థితికి కారణమేంటి?

ఫారెన్ చదువులు.. ఫారెన్ ఉద్యోగాలు… ఫారెన్‌లో సెటిల్‌మెంట్. కానీ ఇప్పుడిప్పుడే ఫారెన్‌లో ఎంత దుర్భర పరిస్థితి ఉందో మనవాళ్లకు అర్థమవుతోంది. రెడిట్‌లో ఓ ఇండియన్ స్టూడెంట్ రాసిన లెటర్ గురించి ఓసారి చెప్పుకోవాలి. కెనడాలో చదువంటే ఏదో ఊహించేసుకుని ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తారు గానీ.. ప్రొఫెసర్లకు చదువు చెప్పాలనే ధ్యాసే ఉండదు. ఫీజులెక్కువ, చదువు తక్కువ. ఆ సిలబస్ కూడా ఏనాడో కాలం చెల్లింది. వాళ్లిచ్చే డిగ్రీ చూసి ఎవరూ జాబ్ కూడా ఇవ్వరు. పైగా ఖర్చులెక్కువ. అద్దెలు, పచారీ సామాన్ల రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ. బతకడానికి ఊబర్‌లోనో, గోడౌన్స్‌లోనో పనిచేయాలి. సో, పెద్ద చదువుల కోసం భారత్‌ను వీడొద్దు అంటూ రాసుకొచ్చాడు. ఇది అక్షరాలా నిజం. మొన్నా మధ్య న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ మినిస్టర్ ఎరికా స్టాన్‌ఫర్డ్ ఓ కామెంట్ చేశారు. ‘భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వడమా.. నో వే’ అని తీసిపారేశారు. వెరీ రీసెంట్.. అమెరికా నెవార్క్ ఎయిర్‌పోర్టులో ఓ ఇండియన్ స్టూడెంట్‌ను నేలపై పడేసి, పెడరెక్కలు విరిచి ఘోరంగా అవమానించారు. ఒకప్పుడు ఇమ్మిగ్రెంట్స్‌ను గౌరవంగానే చూసేవాళ్లు. ఇప్పుడు తమను దోచుకోడానికి వచ్చారన్నట్టుగా చూస్తున్నారు. అందుకే, సంకెళ్లు వేసి మరీ గుంజుకొచ్చి భారత్‌లో పడేశారు. చదువులకని విదేశాల వెంట పడడం తగ్గింది. ఫారెన్ ఉద్యోగాల కోసం ఆరాటమూ తగ్గింది. విదేశాల్లో ఉండలేని పరిస్థితులు వచ్చేశాయి. అన్నిటికంటే.. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రశాంతత అంతా కుప్పపోసినట్టు.. పరిస్థితులన్నీ భారతదేశంలోనే బాగున్నాయంటున్నారు నిపుణులు....




