AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Face Pack: వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్యాక్‌తో చెక్ పెట్టండి..!

Anti Aging Face Pack: మందారం(Hibiscus) గురించి, మందారం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. మందారంలో ఉండే యాంటీ బయాటిక్స్ శరీరానికి..

Anti Aging Face Pack: వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్యాక్‌తో చెక్ పెట్టండి..!
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2022 | 1:45 PM

Share

Anti Aging Face Pack: మందారం(Hibiscus) గురించి, మందారం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. మందారంలో ఉండే యాంటీ బయాటిక్స్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జుట్టుకు(Hair Care) సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే, జుట్టుకు మాత్రమే కాదు.. అందాన్ని(Beauty) ఇనుమడింప జేయడానికి కూడా మందారం అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు బ్యూటీషియన్స్. మందార పుష్పం.. జుట్టుతో పాటు చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మందార ఫేస్ ప్యాక్ చర్మంపై వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో అద్భుంగా పని చేస్తుంది. చర్మ సంరక్షణ కోసం మందార పువ్వును ఉపయోగించవచ్చునని, ఇది చర్మాన్ని మృదువుగా, తాజాగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందారంతో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మందార, అలోవెరాతో యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్.. మందారం పొడితో ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్‌ను తయారు చేయొచ్చు. ఈ పౌడర్‌ను మార్కెట్‌లోనే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎండిన మందార పువ్వులను గ్రైండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ ఉపయోగించి గ్రైండ్ చేయండి. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మందార పొడిని తీసుకుని అందులో అవసరమైన మొత్తంలో అలోవెరా జెల్ కలపాలి. దీన్ని మిక్స్ చేసి, ఫేస్ మాస్క్‌ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

మందారం, గ్రీన్ టీ.. ఒక గిన్నెలో రెండు చెంచాల మందార పొడిని తీసుకోండి. దానికి 1-2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయాలి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 15-20 నిమిషాల పాటు ఫేస్ మాస్క్‌ను అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు చేయొచ్చు.

మందారం, పెరుగు.. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మందార పొడిని తీసుకోండి. దానికి అవసరమైన మొత్తంలో పెరుగును కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా పట్టించాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత మొఖాన్ని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు చేయొచ్చు. తద్వారా ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు క్రమంగా తొలగిపోతాయి.

మందారం, నిమ్మకాయ.. ఒక గిన్నెలో రెండు చెంచాల మందార పొడిని తీసుకోండి. ఒక తాజా నిమ్మకాయ రసాన్ని కలపండి. కొంచెం నీటిని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ముఖంతో పాటు.. మెడకు కూడా అప్లై చేయాలి. చర్మంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత మంచినీటితో కడగాలి. వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

Also read:

Bandi Sanjay Arrest Issue: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన తెలంగాణ పోలీసు అధికారులు.. బండి సంజయ్ అరెస్టుపై వివరణ..

Hair Care: జుట్టు ఎందుకు నెరిసిపోతుంది? నిపుణులు చెపుబుతున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Covid Vaccine: అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. కోవిడ్‌ టీకా తీసుకోని 3,300 మంది సైనికులను తొలగించాలని నిర్ణయం..!

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!