Bandi Sanjay Arrest Issue: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన తెలంగాణ పోలీసు అధికారులు.. బండి సంజయ్ అరెస్టుపై వివరణ..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలో కరీంనగర్ సీపీ సహా ఇతర పోలీసు సిబ్బంది ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట కరీంనగర్ సీపీ..

Bandi Sanjay Arrest Issue: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన తెలంగాణ పోలీసు అధికారులు.. బండి సంజయ్ అరెస్టుపై వివరణ..
Bandi Sanjay Arrest Issue
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2022 | 1:41 PM

Bandi Sanjay Arrest Issue: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలో కరీంనగర్ సీపీ సహా ఇతర పోలీసు సిబ్బంది ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట కరీంనగర్ సీపీ సత్యనారాయణతోపాటు మరికొందరు పోలీసు అధికారులు హాజరయ్యారు. వీరితోపాటు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా సైతం ఉన్నాట్లుగా సమాచారం.  బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై వివరణ ఇస్తున్నట్లుగా సమాచారం. కాగా, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో.. కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ అనుమతి మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

జనవరి 2వ తేదీన ఉద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ ఆఫీసులోకి వెళ్లి అరెస్టు చేయడంపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న తన విధులకు అడ్డుతగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన ప‌ట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఫిర్యాదు చేశారు.

ఢిల్లీలో ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై పూర్తి వివరాలు అందించారు బండి సంజయ్‌. తన ఇంటిపై పోలీసులు దౌర్జన్యం, అరెస్టును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

తనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారన్నది బండి సంజయ్ ఆవేదన.

ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?