Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

మీరు కూడా బాల్యంలో తెగ ఎంజాయ్ చేసి ఉంటారు. అంతలా ఇప్పుడు చేయడానికి ఛాన్స్ ఉండదు.  అందుకే, బాల్యం అనేది వినోదానికి మరో పేరు. నాటి..

Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..
Ducks Having Fun
Follow us

|

Updated on: Feb 03, 2022 | 8:55 AM

Viral Video: మీరు కూడా బాల్యంలో తెగ ఎంజాయ్ చేసి ఉంటారు. అంతలా ఇప్పుడు చేయడానికి ఛాన్స్ ఉండదు.  అందుకే, బాల్యం అనేది వినోదానికి మరో పేరు. నాటి సంగతులు జీవితాంతం గుర్తుండి పోతుంటాయి. ఆ క్షణాలను గుర్తుకు వస్తే.. చాలా సంతోషంగా ఉంటారు. అసలే చిన్నతనంలో సరదాగా ఆటలాడుకోవడం తప్ప వేరే పని చేసేది ఉండదు. వేరే పని చెయ్యాలని అనిపించదు. కాబట్టి పిల్లలు ఏం చేసినా చూసేవారికి సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు వాన నీటిలోనో.. చదును చేసిన ప్రదేశాల్లోనో జారిపోయే ఫీట్ చాలాసార్లు చేసి ఉండొచ్చు, చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు.. కానీ ఇప్పటికీ ఈ అలవాటు మానుకోలేదు. ఎందుకంటే అది చాలా సరదాగా ఉండేది.అయితే ఇలా సరదా సరదా ఫీట్లు మనమే కాదు జంతువులు, పక్షులు కూడా చేస్తుంటాయి. తమ బాల్యాన్ని తెగ ఏంజయ్ చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో బాతులు పిల్లలు మంచులో జారుతూ కనిపిస్తాయి. ఇలాంటి వీడియోలు మీరు గతంలో చూసి వుండకపోయి ఉంటారు. ఇది చూస్తే మీకు మీ బాల్యం ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది.

సరస్సులోని నీరు మంచుగా మారి దానిపై చాలా బాతులు సరదాగా గడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. వీటిలో రెండు బాతులు చాలా సరదాగా ఉంటాయి. అవి ఎగురుతూ వచ్చి మంచు మీద జారుకుంటూ చాలా దూరం వెళ్తాయి. ఈ దృశ్యం కొంతవరకు ఐస్ స్కేటింగ్ లాగా ఉంటుంది. ఇందులో కూడా స్కేట్‌బోర్డుల సాయంతో మంచు మీద జారుతూ అద్భుతమైన ఫీట్లు చేస్తూ కనిపిస్తారు. సరే, మీరు ఐస్ స్కేటింగ్‌ని చూసి ఉంటారు. కానీ చాలా అరుదుగా మీరు ఎప్పుడైనా మంచు మీద సరదాగా జారిపోతున్న పక్షిని చూసి ఉండరు.

వీడియో చూడండి:

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @buitengebieden_ పేరుతో షేర్  చేయబడింది.  ‘డక్ కర్లింగ్’ అనే శీర్షికతో కేవలం 8 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 86 వేల మందికి పైగా వీక్షించగా.. 38 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు,

ఇవి కూడా చదవండి:  RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..

Chalo Vijayawada: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. నగరంలోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు..