Chalo Vijayawada: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. నగరంలోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు..

పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’టెన్షన్ టెన్షన్‌‌గా మారింది. ఇప్పటికే విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డుకు పి.ఆర్.సి. ఉద్యమ కారులు ఎవ్వరూ రావద్దని విజయవాడ పోలీసులు ఉద్యోగులకు..

Chalo Vijayawada: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. నగరంలోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు..
Chalo Vijayawada Min
Follow us

|

Updated on: Feb 03, 2022 | 7:31 AM

పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’టెన్షన్ టెన్షన్‌‌గా మారింది. ఇప్పటికే విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డుకు పి.ఆర్.సి. ఉద్యమ కారులు ఎవ్వరూ రావద్దని విజయవాడ పోలీసులు ఉద్యోగులకు కోరారు. చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తేల్చి చెప్పారు. అయితే పీఆర్సీ సాధన సమితి మాత్రం నిర్వహించి తీరుతామని మొడి పట్టుదలతో ముందుకు కదులుతోంది. ఇరు శ్రేణులూ మోహరిస్తుండటంతో గడిచే ప్రతి నిమిషమూ ఉద్రిక్తతను పెంచేస్తోంది. భారీగా కదిలివస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎక్కడిక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. వారు పయనమైన దారులనిండా కంచెలు, బారికేడ్లు, పోలీసు వలయాలు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.  దీంతో విజయవాడకు వచ్చే దారులన్నింటి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కట్టడి.. అరెస్టులు.. నేతల గృహ నిర్బంధాలు.. ఉపాధ్యాయుల ఇళ్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

అంతే కాకుండా విజయవాడ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బి.ఆర్.టి.ఎస్. రోడ్లో నిర్వహించు కార్యక్రమం వద్ద పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ ఆకస్మికముగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాలలో పోలీస్ పికెట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల వద్ద తనిఖీలు, వాహనాల తనిఖీలు, లాడ్జిల తనిఖీలను చేపట్టి అనుమానితులను చెక్ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా బి.ఆర్.టి.ఎస్. రోడ్ ప్రాంతంలో సుమారు 100 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పాల్కన్ వాహనంతో, డ్రోన్ కెమెరా ద్వారా, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

పాత జీతాలు అడిగితే కొత్త వేతనాలు వేయడం.. చర్చలకు పెట్టిన ఏ షరతునూ ఖాతరు చేయకపోవడం…ఉద్యోగులు భయపడినట్టే కొత్త పీఆర్సీతో తగ్గిన జనవరి వేతనాలను డీఏలతో కవర్‌ చేసి సర్కారు చేసిన తొండి నేపథ్యంలో అందరి దృష్టి ‘చలో విజయవాడ’పైనే నిలిచింది. ‘చలో’ను విజయవంతం చేయాలనే శక్తులూ, ఆ పిలుపును భగ్నం చేయాలని చూస్తున్న పోలీసు బలగాలూ.. రెండూ ఇప్పుడు విజయవాడపైనే కేంద్రీకరించాయి.

మరోవైపు పోలీస్‌ వ్యూహాలు, వలయాలను చేధించుకుంటూ ఇప్పటికే పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఉద్యోగులు సంఘ నాయకులు విజయవాడ చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న వారిని పార్వతీపురం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలు ఇళ్లకు పోలీసులు చేరుకుని ఈమేరకు నోటీసులు అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడవైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించారు. నగరంలోకి ప్రవేశించే వారధి, గొల్లపూడి, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం శివార్లలో చెక్‌పోస్టులు పెట్టారు. ఏ దారినీ వదలకుండా జల్లెడ పడుతున్నారు.

అయితే ఉద్యోగులు మాత్రం ఇప్పటికే మారువేశాల్లో విజయవాడ నగరానికి చేరుకున్నారు. కొందరు బిచ్చగాళ్ల వేశంలో వస్తే.. మరికొందరు రైతుల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, డార్మెటరీల్లో సోదాలు చేస్తున్నారు. సభ జరిగే విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులోనే వంద సీసీ కెమెరాలను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి: Black Magic: వామ్మో..! ఇవేం క్షుద్రపూజలు.. ముగ్గుతో బొమ్మ వేసి.. భయానకం

Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్