Andhra Pradesh PRC: ఏపీలో ‘ఛలో విజయవాడ’ టెన్షన్.. మారువేషాల్లో ఉద్యోగులు, అడ్డుకుంటున్న పోలీసులు..

Andhra Pradesh PRC: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు.

Andhra Pradesh PRC: ఏపీలో ‘ఛలో విజయవాడ’ టెన్షన్.. మారువేషాల్లో ఉద్యోగులు, అడ్డుకుంటున్న పోలీసులు..
Ap Employees
Follow us

|

Updated on: Feb 03, 2022 | 10:46 AM

Andhra Pradesh PRC: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవాడలో టెన్షన్ వాతావరాణాన్ని నెలకొల్పింది. మరోవైపు ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా.. ఉద్యమం నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగుల ఉద్యమంపై అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ మోహరించారు. ఉద్యోగులను విజయవాడ రాకుండా అడ్డగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగరానికి వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బిఆర్టిఎస్ రోడ్ ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉద్యోగులు.. ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి ఉద్యోగులు విజయవాడకు బయలుదేరుతున్నారు. విజయనగరం జిల్లాలో ‘ఛలో విజయవాడ’కు వెళ్తున్న ఉద్యోగులను పార్వతీపురం రైల్వే స్టేషన్‌ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఉద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము విజయవాడ వెళ్లాల్సిందే అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఉద్యోగులు. తమ హక్కులను కాలరాయొద్దంటూ నినాదాలు చేశారు ఉద్యోగులు. అయితే, చట్టప్రకారమే అడ్డుకుంటున్నామని పోలీసులు బదులిచ్చారు.

మారువేషాల్లో విజయవాడకు.. ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఉద్యోగులు రూటు మార్చారు. మారు వేషాల్లో విజయవాడకు బయలుదేరుతున్నారు. ఛలో విజయవాడకు పోలీసులు ఆంక్షలు విధించడం, ఇప్పటికే ఎక్కడికక్కడ నిర్బంధం విధిస్తుండటంతో.. పోలీసుల దృష్టి మరల్చి మారు వేషాల్లో బయలుదేరుతున్నారు ఉద్యోగులు. రైళ్లు, బస్సుల ద్వారా విజయవాడ బయలుదేరారు ఆందోళన కారులు.

విజయవాడలో భారీగా మోహరించిన పోలీసులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేనందున ప్రకాశం బ్యారేజి కనకదుర్గమ్మ వారధి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బారీకేడ్లు ఏర్పాటు చేసి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. బ్యారేజీ వద్ద వాహన తనిఖీలను పరిశీలిస్తున్నారు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రాంబాబు. నగర వ్యాప్తంగా కూడా ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నగరంలో ప్రవేశించే అన్ని మార్గాలు, వారధి, ప్రకాశం బ్యారేజ్, రామవరప్పడు రింగ్ రోడ్డు, బిఆర్టియస్ రోడ్డులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ బారికెట్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనికీలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నారు. ఇప్పటికే ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగుల కోసం నగరాన్ని జల్లెడ పట్టారు పోలీసులు. సత్యనారాయణపురంలోని లాడ్జి లలో ఉద్యోగులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు సిపి క్రాంతి రానా టాటా, పొలీస్ సిబ్బంది.

Also read:

BJP Bhim Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ భీం దీక్ష.. ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష..

UPSC IFS 2022: యూపీఎస్సీ 2022 ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం ఇదే..

FIR Movie: ఎఫ్ఐఆర్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ప్రయాణం సాంగ్..

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు