FIR Movie: ఎఫ్ఐఆర్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ప్రయాణం సాంగ్..

తమిళ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్ (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ (Manu Anand) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

FIR Movie: ఎఫ్ఐఆర్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ప్రయాణం సాంగ్..
Fir
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 7:12 AM

తమిళ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్ (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ (Manu Anand) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ సినిమా తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే సినిమాపై క్యూరియాలసిటీ మ‌రింత పెరిగింది.

ఈ చిత్రానికి అశ్వంత్ సంగీతాన్ని అందిచారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ప్రయాణం అనే పాట విడుదలైంది. అద్భుతమైన బాణీకి అందమైన విజువల్స్ తోడైనట్టు కనిపిస్తోంది. రాకేందు మౌళి సాహిత్యం, అభయ్ జోధ్‌పుర్కర్ గానం అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐస్ఐస్‌ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనేది ఎఫ్ఐఆర్ మూల‌కథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు మరియు హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో జ‌రుగుతుంది. స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అశ్వంత్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…