AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Office Tips: ఉదయం ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్తున్నారా? నిమిషాల్లో రెడీ అయ్యే 6 ఫ్యాషన్ చిట్కాలు!

లస్యంగా నిద్రపోవడం, రాత్రి వేళల్లో సెల్‌ఫోన్‌లు, సోషల్ మీడియాకు అతుక్కుపోవడం ఇటీవల సర్వసాధారణమైంది ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఆఫీస్‌కు సిద్ధం కావడానికి సమయం సరిపోక హడావిడి పడుతున్నారా? స్టైల్, కంఫర్ట్‌ను ఏమాత్రం కోల్పోకుండా, క్షణాల్లోనే ఆఫీస్ రెడీ అయ్యేందుకు కొన్ని సులభమైన ఫ్యాషన్ చిట్కాలు మీకు సహాయపడతాయి,కొన్ని ఫ్యాషన్ చిట్కాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. వీటిని పాటిస్తే, ప్రతిరోజూ ఉదయం స్టైలిష్‌గా, ఆత్మవిశ్వాసంతో బయలుదేరగలరు.

Office Tips: ఉదయం ఆఫీస్‌కు ఆలస్యంగా వెళ్తున్నారా? నిమిషాల్లో రెడీ అయ్యే 6 ఫ్యాషన్ చిట్కాలు!
Beat The Morning Rush 6 Quick Fashion Tips
Bhavani
|

Updated on: Jul 24, 2025 | 1:56 PM

Share

ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి వేళల్లో సెల్‌ఫోన్‌లు, సోషల్ మీడియాకు అతుక్కుపోవడం ఇటీవల సర్వసాధారణమైంది. దీనివల్ల ఉదయాన్నే త్వరగా నిద్రలేవలేక, ఆఫీస్‌కు వెళ్లడానికి సమయం సరిపోక హడావిడిగా రెడీ అవుతున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల స్టైల్, కంఫర్ట్ విషయంలో వెనుకబడి, ఆఫీసులో రోజంతా ఇబ్బందిగా గడపాల్సి వస్తుంది. కొన్ని నిమిషాల్లోనే ఆఫీస్‌కు సిద్ధమయ్యే కొన్ని ఫ్యాషన్ చిట్కాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. వీటిని పాటిస్తే, ప్రతిరోజూ ఉదయం స్టైలిష్‌గా, ఆత్మవిశ్వాసంతో బయలుదేరగలరు.

1. రాత్రిపూటే సిద్ధం చేయండి: మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉన్నవారైతే, మరుసటి రోజుకు ముందుగానే ఆఫీస్ డ్రెస్‌ను సిద్ధం చేసుకోండి. రాత్రిపూటే బట్టలను ఇస్త్రీ చేసి, పై దుస్తులు, లోదుస్తులు వేర్వేరుగా, అందుబాటులో ఉండేలా ఒక చోట పెట్టుకోండి. ఇది ఉదయం ఆలస్యంగా లేచినప్పటికీ ఎటువంటి తొందర లేకుండా త్వరగా రెడీ అవ్వడానికి సహాయపడుతుంది.

2. క్లాసిక్ వైట్ షర్ట్ లేదా బ్లౌజ్: మీ వార్డ్‌రోబ్‌లో క్లాసిక్ వైట్ షర్ట్ లేదా బ్లౌజ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది దేనితోనైనా మ్యాచ్ అవుతుంది. దీన్ని ఒక బ్లాక్ స్కర్ట్, ట్రౌజర్ లేదా జీన్స్‌తో జత చేయొచ్చు. దీనిపై ఒక బ్లేజర్ వేసుకుంటే మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. ఇది మీకు ఫార్మల్ లుక్‌ను అందిస్తుంది.

3. స్టేట్‌మెంట్ యాక్సెసరీస్: సరళమైన దుస్తులకు కూడా స్టేట్‌మెంట్ నెక్‌లెస్, చెవిపోగులు లేదా బ్రేస్‌లెట్‌లు వంటి యాక్సెసరీస్ అదనపు ఆకర్షణను ఇస్తాయి. ఒక మంచి వాచ్ లేదా స్కార్ఫ్ కూడా మీ లుక్‌ను ఎలివేట్ చేస్తుంది. ఇవి తక్కువ సమయంలోనే మీ రూపాన్ని మార్చేస్తాయి. ఆడవారు సాధారణ కుర్తీ లేదా టాప్‌కు రంగుల ప్రింటెడ్ దుపట్టా లేదా స్కార్ఫ్ జత చేస్తే, మీ రూపాన్ని పూర్తిగా మార్చేసి, దుస్తులకు స్టైల్‌ను జోడిస్తుంది.

4. షూస్: మీ దుస్తులు ఎంత బాగున్నా, సరైన షూస్ లేకపోతే లుక్ పూర్తి కాదు. హీల్స్, లోఫర్స్ లేదా బ్యాలెట్ ఫ్లాట్స్ వంటివి ఆఫీస్‌కి అనుకూలంగా ఉంటాయి. సౌకర్యవంతంగా ఉండే షూస్ ముఖ్యమైనవి. వీటిని కూడా రాత్రి పూటే రెడీ చేసుకోండి. షూస్‌ను శుభ్రం చేసుకోవడం, పాలిష్ చేసుకోవడం లాంటి పనులు రాత్రి పూటే చేసుకునేలా ప్లాన్ చేసుకోండి.

5. దుస్తులు: ఒకే రంగు దుస్తులను (మోనోక్రోమ్) ధరించడం వల్ల మీరు ఎత్తుగా, సన్నగా కనిపిస్తారు. ఇది చాలా స్టైలిష్‌గా, అధునాతనంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒకే రంగు షర్ట్, ప్యాంట్ ధరించడం. అమ్మాయిలు అనేక విధాలుగా దుస్తులు ధరించవచ్చు కాబట్టి, వారు ఈ పద్ధతిని అవలంబించాలి. ఇది మీ లుక్‌ను అందంగా చేస్తుంది.

6. తేలికపాటి మేకప్: ఉదయాన్నే ఎక్కువ సమయం మేకప్‌కు కేటాయించకుండా, మస్కారా, కాటుక, సహజమైన లిప్‌స్టిక్ వంటి వాటిని ఉపయోగించి నిమిషాల్లోనే సిద్ధం అవ్వొచ్చు. సమయం లేకపోతే, లైట్, న్యూడ్ మేకప్ చేసుకోవచ్చు. ఫౌండేషన్, కాజల్, లిప్‌స్టిక్‌తో మీరు అద్భుతమైన లుక్‌ను పొందవచ్చు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా మీ లుక్‌ను ఆకర్షణీయంగా మారుస్తుంది.

ఈ చిట్కాలు పాటిస్తే, ప్రతిరోజూ ఉదయం ఆఫీస్‌కి సిద్ధం కావడానికి మీరు ఎక్కువ సమయం తీసుకోకుండానే స్టైలిష్‌గా, ఆత్మవిశ్వాసంతో బయలుదేరగలరు.