AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు ఈజీగా మాయం..! స్కిన్ మెరుపు ఖాయం..!!

పురుషుల ముఖాల్లో మీసాలు, గడ్డాలు ఎవరికీ సమస్య కాదు. ఇది సర్వసాధారణం. అయితే, పురుషులకు మీసం, గడ్డం లేకపోతేనే సమస్య. ఎందుకంటే.. అలాంటి వారిని అందరూ ఎగతాళి చేస్తారు. కానీ, మహిళల విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారుతుంది. మహిళల ముఖాల్లో అవాంఛిత వెంట్రుకలు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఆడవారిలో కనిపించే అవాంఛిత వెంట్రుకల కారణంగా వారు మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు. దాంతో నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా..? ముఖంపై వెంట్రుకలను నివారించే అద్భుతమైన ఉపాయం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా చేస్తే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు ఈజీగా మాయం..! స్కిన్ మెరుపు ఖాయం..!!
How To Reduce Facial Hairs
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2025 | 7:25 PM

Share

మహిళల ముఖాల్లో అవాంఛిత వెంట్రుకలు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఆడవారిలో కనిపించే అవాంఛిత వెంట్రుకల కారణంగా వారు మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు. దాంతో నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా..? ముఖంపై వెంట్రుకలను నివారించే అద్భుతమైన ఉపాయం ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది మహిళలు థ్రెడింగ్ ఉపయోగించి ముఖంపై ఉన్న అవాంఛిత వెంట్రుకలను తొలగించుకుంటారు. మరికొందరు ప్లైయర్‌తో ముఖ భాగంలో ఉన్న వెంట్రుకలను తీస్తుంటారు. అయితే, ఈ పద్ధతులను ఉపయోగించి వెంట్రుకలను తొలగించడం చాలా బాధాకరంగా ఉంటుందనేది కూడా నిజం. మీరు నొప్పి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుడు రాబిన్ శర్మ సిఫార్సు చేసిన నివారణతో మీ ముఖంపై ఇబ్బంది పెడుతున్న జుట్టును ఇట్టే తొలగించుకోవచ్చు. ఇది ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. దీని గురించి మరింత తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

హార్మోన్ల మార్పుల వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు వస్తాయని డాక్టర్‌ రాబిన్ శర్మ వివరించారు. మహిళల్లో ఆండ్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. దీనిని నివారించడానికి, మీరు మీ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవాలి. దీనికి మీకు ఎలాంటి మందులు అవసరం లేదు. మెంతి గింజలు సహా కొన్ని ఇంట్లో దొరికే పదార్థాలతో మీ హార్మోన్లను సమతుల్యం చేసుకోవచ్చు. ఇప్పుడు, ఈ పానీయం తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల గురించి తెలుసుకుందాం.

– 1 టీస్పూన్ మెంతి గింజలు

– అర అంగుళం అల్లం

– ఒక అతి మధురం ముక్క(Licorice Root)

– అర అంగుళం దాల్చిన చెక్క

– కొంచెం ఆస్పరాగస్(శతావరి లేదా పిల్లి తేగ)

మీరు అన్ని పదార్థాలను 2 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు వాటిని బాగా కలిపి రోజంతా ఈ నీటిని తక్కువ పరిమాణంలో తాగుతూ ఉండాలి.. ఇది మీ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. PCOD, PCOS ని నివారిస్తుంది. థైరాయిడ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది క్రమంగా అవాంఛిత ముఖ రోమాలను తగ్గిస్తుంది. మీ చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ముఖంపై అవాంఛిత వెంట్రుకలు హార్మోన్ల అసమతుల్యత వల్ల సంభవిస్తాయి. ఈ ఆయుర్వేద కలయిక హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మెంతి గింజలు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అల్, దాల్చిన చెక్క మంటను తగ్గిస్తాయి. లైకోరైస్ ఆండ్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఆస్పరాగస్ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను పోషిస్తుంది.

అందుకే ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం హార్మోన్ల వ్యవస్థ సమతుల్యం అవుతుంది. ఇది కాలక్రమేణా ముఖంపై అవాంఛిత రోమాలు పెరగడాన్ని కూడా తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..