Barley Water: నడవలేని వారిని సైతం పరిగెత్తించే బార్లీ నీరు.. ఇలా తాగితే రెట్టింపు లాభాలు..!
వేళాపాల లేకుండా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.. అందువల్ల, ఫిట్‌గా, ఆరోగ్యకరమైన శరీరానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యమైనది. బరువు తగ్గడానికి, మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఒక అద్భుతమైన ధాన్యాన్ని మీరు మరచిపోయి ఉండవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అదేంటో ఇక్కడ చూద్దాం...

నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజలు 9 గంటల షిఫ్టులలో పని చేస్తున్నారు. వారి జీవనశైలి కూడా చాలా బిజీగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యం, శరీర బరువు గురించి తెలుసుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. గంటల తరబడి ఆఫీసు కుర్చీలో కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వేగంగా అధిక బరువు పెరుగుతున్నారు.. వేళాపాల లేకుండా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.. అందువల్ల, ఫిట్‌గా, ఆరోగ్యకరమైన శరీరానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యమైనది. బరువు తగ్గడానికి, మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఒక అద్భుతమైన ధాన్యాన్ని మీరు మరచిపోయి ఉండవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అదేంటో ఇక్కడ చూద్దాం…
ఎన్నో సమస్యల నుంచి బయటపడేందుకు బార్లీని పురాతన కాలంలో ఎక్కువగా తినేవారట. ఆయుర్వేదంలో వీటిని ఔషదంగా ఉపయోగిస్తారు. సహజ ఆహారం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ ఒక వరం లాంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది అవసరమైన సూక్ష్మపోషకాలతో కూడిన అధిక ఫైబర్ కలిగిన తృణధాన్యం. బార్లీని శతాబ్దాలుగా పశుగ్రాసంగా, బీరు, కొన్ని స్వేదన పానీయాలకు కిణ్వ ప్రక్రియ మూలంగా ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణంగా సూప్‌లు, స్టూలు, బార్లీ బ్రెడ్ వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, బార్లీ నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి, కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా..?
బార్లీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సిద్ధం చేస్తాయి. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. బార్లీ నీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మకాయ రసాన్ని కలపడం వల్ల ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. బార్లీ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఈ నీరు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) సమస్యలను తగ్గించడానికి కూడా బార్లీ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఎక్కువ మూత్ర విసర్జనకు సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది. మూత్రపిండాలు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. దీని వల్ల యూటీఐ లాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు.
ఒక అధ్యయనం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి , డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచడానికి బార్టీ నీరు అద్భుతంగా సహాయపడుతుంది. బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఆరోగ్యకరమైనది. ఎందుకంటే వీటి వాడకం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. బార్లీ నీటిని తాగడం వల్ల తరచుగా ఆకలయ్యే సమస్యే ఉండదు. అలాగే మీరు తక్కువ మొత్తంలో కేలరీలను తీసుకుంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి బార్లీ నీటిని ఎలా తయారు చేసుకోవాలి?:
బార్లీ నీటిని తయారు చేయడానికి ముందుగా దానిని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి. ఆ నీటిలో నిమ్మ తొక్కను వేసి, తక్కువ మంట మీద 15 నిమిషాలు మరిగించాలి. బార్లీ ఉడికిన తరువాత ఆ నీటిని వడకట్టి, తేనె కలిపి, ప్రతి ఉదయం తిసుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








