AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..

ప్రస్తుతం మార్కెట్‌లో అందాన్ని పెంచే అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ అందాన్ని సహజంగా పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

Beauty Tips: ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..
Beauty Tips
Madhavi
| Edited By: |

Updated on: May 27, 2023 | 7:18 AM

Share

ప్రస్తుతం మార్కెట్‌లో అందాన్ని పెంచే అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ అందాన్ని సహజంగా పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ప్రయత్నించవలసిన కొన్ని ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం. ఇవి మీ బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి.

  1. హెర్బల్ ఫేస్ మాస్క్: ఆయుర్వేదం ఎల్లప్పుడూ చర్మానికి సహజసిద్ధమైన పదార్థాలనే ఉపయోగిస్తుంది. కాబట్టి పసుపు, చందనం, వేప, రోజ్ వాటర్ లేదా తేనె వేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ పదార్థాలు యాంటీ బాక్టీరియల్ ,క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ స్కిన్ టోన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  2. అభ్యంగ: అభ్యంగ అంటే మీ శరీరాన్ని గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం. దీని వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వేడి నీళ్లలో స్నానం చేసే ముందు ఇలా చేస్తే శరీరమంతా రిలాక్స్ అవుతుంది.
  3. శ్వాస వ్యాయామాలు చేయండి: శారీరక ఒత్తిడి కంటే మానసిక ఒత్తిడి చర్మ ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఒక గొప్ప మార్గం. మీరు నిద్రపోయే ముందు, సాధారణ శ్వాస వ్యాయామాలు చేయండి. మీరు పడుకునే ముందు లేదా రోజులో ఎప్పుడైనా 5 నుండి 20 నిమిషాల వరకు దీన్ని ప్రాక్టీస్ చేయండి.
  4. జల చర్య: జలనేతి క్రియ అంటే నేతి కుండ ద్వారా ఒక ముక్కు రంధ్రము ద్వారా నీటిని పోసి మరొక ముక్కు రంధ్రము ద్వారా బయటకు పంపుట. ఇది నాసికా రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ముక్కు కారటం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. నాలుకను శుభ్రపరచడం: అంతర్గత ఆరోగ్యానికి నాలుక శుభ్రపరచడం ముఖ్యం. నాలుక ఉపరితలాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల అమాను తగ్గించవచ్చు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
  7. చక్కెర ,ఉప్పు తీసుకోవడం తగ్గించడం: అధిక ఉప్పు తీసుకోవడం మీ రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేయడమే కాకుండా మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే, అదనపు చక్కెర, ఉప్పు మొత్తం చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది.