Gold Cleaning Precautions: బంగారు ఆభరణాలు క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కేవలం లేడీస్ మాత్రమే కాదు.. ఇప్పుడు మగవారు కూడా ఒంటి నిండా బంగారం వేసుకుని తిరుగుతున్నారు. బంగారం కొని.. వేసుకున్నంత వరకూ బాగానే ఉన్నా.. కాలం గడిచే కొద్దీ వాటి మెరుపు అనేది తగ్గి పోతుంది. దీంతో వాటికి మెరుగు పెట్టిస్తూంటారు. బంగారు షాపుల్లో మెరుగు పెడితే.. కొద్దిగైనా బంగారం పోతుంది. అందుకే ఇంట్లోనే నేచురల్ టిప్స్ సహాయంతో మెరుగు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడే చాలా మంది కొన్ని పొరపాట్లు..

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కేవలం లేడీస్ మాత్రమే కాదు.. ఇప్పుడు మగవారు కూడా ఒంటి నిండా బంగారం వేసుకుని తిరుగుతున్నారు. బంగారం కొని.. వేసుకున్నంత వరకూ బాగానే ఉన్నా.. కాలం గడిచే కొద్దీ వాటి మెరుపు అనేది తగ్గి పోతుంది. దీంతో వాటికి మెరుగు పెట్టిస్తూంటారు. బంగారు షాపుల్లో మెరుగు పెడితే.. కొద్దిగైనా బంగారం పోతుంది. అందుకే ఇంట్లోనే నేచురల్ టిప్స్ సహాయంతో మెరుగు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడే చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. బంగారానికి వేటితో పడితే వాటితో క్లీన్ చేయకూడదు. దీని వల్ల అసలుకే మోసం వస్తుంది.
టూత్ పేస్ట్ – బ్లీచ్:
చాలా మంది టూత్ పేస్ట్ లేదా బ్లీచ్ తో బంగారాన్ని శుభ్ర పరుస్తూ ఉంటారు. ఇవి జిడ్డు వంటి వాటిని వదిలించుకోవడానికి మంచిదే కానీ.. బంగారాన్ని శుభ్రం చేయడంలో మాత్రం మంచిది కాదు. టూత్ పేస్ట్ తో బంగారు ఆభరణాలని రుద్దడం వల్ల వాటి మెరుపు, నాణ్యత పాడైపోవచ్చు. అలాగే బ్లీచ్ తో గోల్డ్ ని అస్సలు క్లీన్ చేయకండి. ఇది కూడా బంగారంపై ఉండే మెరుపును తగ్గిస్తుంది. కలర్ కూడా మారి పోవచ్చు. అలాగే రాళ్ల నాణ్యత కూడా పాడవుతుంది.
నిమ్మకాయ:
నిమ్మ కాయతో ఎన్నో రకాల వస్తువుల మురికి వదిలించు కోవచ్చు. ముఖ్యంగా నిమ్మకాయ సహాయంతో కిచెన్ ని మిలమిలమని మెరిపించు కోవచ్చు. అంతే కాకుండా దుర్వాసన కూడా రాకుండా చేస్తుంది. కానీ నిమ్మ కాయతో బంగారాన్ని మాత్రం అస్సలు క్లీన్ చేయకూడదు. ఇది ఆభరణాలకు రాపిడిని కలిగిస్తాయి. ఇది ముఖ్యంగా మృదువైన రాళ్లకు హాని కలిగిస్తుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో బంగారాన్ని అస్సలు క్లీన్ చేయకూడదు. బేకింగ్ సోడా ప్రకృతిలో చాలా ఆల్కలీన్. ఆమ్ల పదార్థాల మాదిరిగానే, అధిక ఆల్కలీన్ కంటెంట్ కూడా మీ ఆభరణాలని నాశనం చేస్తుంది. కాబట్టి బేకింగ్ సోడాను అస్సలు ఉపయోగించకండి.
ఆల్కహాల్:
కొంత మంది ఆల్కహాల్ తో కూడా బంగారు ఆభరణాలని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా పొరపాటును కూడా చేయకూడదు. అధిక ఆల్కహాల్ కంటెంట్ కారణంగా మీ గోల్డ్ ఆభరణాల నాణ్యత దెబ్బతీస్తుంది. ఇది రత్నాలను, రాళ్లను నాశనం చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ను అస్సలు వాడకండి.