ఓర్నాయనో.. టీ తాగిన తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినకండి.. ఎందుకంటే..
కొంచెం చిరాగ్గా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. వెంటనే టీ.. తాగుతారు.. టీ అనేది ప్రతి భారతీయుడి దైనందిన జీవితంలో అంతర్భాగం. పార్టీలో అయినా, దుకాణంలో అయినా, ఇంట్లో అయినా - చాలా మంది ఒక కప్పు వేడి టీ లేకుండా తమ రోజు అసంపూర్ణంగా ఉంటుందని భావిస్తారు. టీ మనశ్శాంతిని అందిస్తుంది.. చురుకుదనాన్ని కూడా పెంచుతుంది.

కొంచెం చిరాగ్గా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. వెంటనే టీ.. తాగుతారు.. టీ అనేది ప్రతి భారతీయుడి దైనందిన జీవితంలో అంతర్భాగం. పార్టీలో అయినా, దుకాణంలో అయినా, ఇంట్లో అయినా – చాలా మంది ఒక కప్పు వేడి టీ లేకుండా తమ రోజు అసంపూర్ణంగా ఉంటుందని భావిస్తారు. టీ మనశ్శాంతిని అందిస్తుంది.. చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. అయితే, టీతో పాటు అన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలతో టీ తీసుకోవడం వల్ల పోషకాల శోషణ తగ్గుతుంది.. కడుపు సమస్యలు వస్తాయి.. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీయవచ్చు.
టీతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
టీతో పాటు, టీ తాగిన వెంటనే తీసుకోకూడని ఆహారాలు ఏంటో తెలుసుకోండి..
శనగ పిండితో చేసిన ఆహారాలు (పకోడీలు): టీతో లేదా టీ తాగిన వెంటనే శనగ పిండితో చేసిన ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ కలయిక జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం – అజీర్ణానికి దారితీస్తుంది. అందువల్ల, అతిథులకు వడ్డించే బేసాన్ (శనగపిండి) పదార్థాలను టీతో తినకుండా ఉండటం మంచిది.
నిమ్మరసం – పుల్లని పదార్థాలు: కొంతమంది టీలో నిమ్మకాయను కలిపి తాగుతారు. అయితే, నిమ్మకాయ దాని సిట్రస్ స్వభావం కారణంగా.. ఉబ్బరం – జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, టీ తాగేటప్పుడు నిమ్మకాయ లేదా దాని రసాన్ని తీసుకోకపోవడం మంచిది.
పసుపు: టీ తాగిన తర్వాత పసుపు కూడా తీసుకోకూడదు.. పసుపు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. టీ ఆకులు – పసుపును కలిపి తీసుకోవడం హానికరం.
చల్లని పదార్థాలు: చాలా మందికి తెలియకుండానే, వేడి టీతో పాటు చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. వేడి టీ తాగిన తర్వాత అరగంట పాటు చల్లని ఆహారాలు తినకండి.
ఆకుకూరలు: టీతో పాటు ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. టీలోని టానిన్లు – ఆక్సలేట్లు ఇనుము శోషణను నిరోధిస్తాయి.. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోకపోవడమే మంచిది..
అందువల్ల, టీ తాగేటప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలనే నియమాన్ని పాటించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేడి టీ మనశ్శాంతిని ఇచ్చినప్పటికీ, సరైన ఆహార కలయికతోనే మన శరీరం బలంగా ఉంటుందంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




