Back Pain Relief Tips: నడుము నొప్పి సమస్య బాగా వేధిస్తోందా.. ఈ టిప్స్ మీకోసమే!
ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పి, వెన్ను, మెడ నొప్పులతో బాధ పడుతున్నారు. గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల.. ఈ నడుము నొప్పి సవ్తుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవాళ్లు నడుము నొప్పితో మరింత ఎక్కువగా సతమతమవుతున్నారు. బ్యాక్ పెయిన్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. అందులోనూ యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. నడుము నొప్పి వచ్చిందంటే.. చాలా మంది పెయిన్ కిల్లర్స్..

ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పి, వెన్ను, మెడ నొప్పులతో బాధ పడుతున్నారు. గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల.. ఈ నడుము నొప్పి సవ్తుంది. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవాళ్లు నడుము నొప్పితో మరింత ఎక్కువగా సతమతమవుతున్నారు. బ్యాక్ పెయిన్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. అందులోనూ యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. నడుము నొప్పి వచ్చిందంటే.. చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. కానీ వీటి వల్ల భవిష్యత్తులో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతన్నారు. ఈ నడుము నొప్పికి చెక్ పెట్టాలంటే.. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది. ఇంటి చిట్కాలకు కూడా తగ్గకపోతే.. అప్పుడు వైద్యులను సంప్రదించడం మేలు.
ఐస్ ముక్కతో రుద్దండి:
నడుము, మెడ నొప్పి ఉన్న చోట.. ఐస్ ముక్కతో ముందు రుద్దండి. వెంటనే ఉపశమనం కలగకపోయినా.. కాసేపటికి మీకు రిలీఫ్ ఉంటుంది. ఇలా రోజుకు ఒకసారి చేసినా పర్వాలేదు.
పాలు తాగండి:
నడుము, వెన్ను నొప్పితో బాధ పడేవారు గోరు వెచ్చటి పాలలో తేనె కలిపి తాగండి. ఇలా తాగడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం పేస్ట్:
నొప్పి అధికంగా ఉండేవారు.. అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేయండి. ఇలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్కను నీటిలో మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
అటూ ఇటూ నడుస్తూ ఉండాలి:
డెస్క్ జాబ్, కూర్చుని లేదా నిలబడి ఎక్కువగా పని చేసేవారు అప్పుడప్పుడూ ఓ ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే నొప్పి కంట్రోల్ అవుతుంది.
గసగసాలు:
గసగసాల పొడితో కూడా నడుము నొప్పికి చెక్ పెట్టొచ్చు. గసగసాలను వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని.. కొంచెం గోరు వెచ్చటి పాలలో కలుపుకుని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నడుపు నొప్పిగా ఉండేవారు ఎక్కువగా బరువులు ఎత్తకండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




