- Telugu News Photo Gallery Depending on the color of your urine, you can tell what kind of diseases you have, check details
Urine Precautions: మీ మూత్రం రంగు బట్టి.. ఎలాంటి వ్యాధులు వస్తాయో చెప్పొచ్చు!
శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు సాధారణంగా మలం, మూత్రం, చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువగా వైద్యులు యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మూత్రం రంగులు మారి వస్తుంది. వ్యక్తి శరీరతత్వం, ఆహారపు అలవాట్లను బట్టి.. మూత్రంలో రంగులు అనేవి మారుతూ వస్తాయి. మూత్రంలో ఎక్కువగా రంగు..
Updated on: Mar 14, 2024 | 5:10 PM

శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు సాధారణంగా మలం, మూత్రం, చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువగా వైద్యులు యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మూత్రం రంగులు మారి వస్తుంది.

వ్యక్తి శరీరతత్వం, ఆహారపు అలవాట్లను బట్టి.. మూత్రంలో రంగులు అనేవి మారుతూ వస్తాయి. మూత్రంలో ఎక్కువగా రంగు మారి వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. మూత్రం రంగు మారి కొద్ది రోజులుగా అలాగే వస్తే.. మీరు ఏదో ఇన్ ఫెక్షన్ బారిన పడి ఉంటారని గమనించాలి.

మూత్రం క్లియర్‌గా లేత పసుపు రంగులో వస్తుంటే.. మీరు నీళ్లు బాగానే తీసుకుంటున్నారని, ఎలాంటి వ్యాధులు లేవని అర్థం చేసుకోవచ్చు. అలాగే మూత్రం ముదురు పసుపు రంగులో వస్తోంది అంటే.. జాగ్రత్త పాడాల్సిందే.

ఈ రంగు డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది. అంటే మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని అర్థం. మరింతగా నీళ్లు, ఫ్లూయిడ్స్ అనేవి తాగుతూ ఉండాలి. అలాగే మూత్రం నారింజ రంగులో వస్తుంటే మాత్రం.. ట్యాబ్లెట్లను వాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

లివర్ లేదా పిత్తాశయ సమస్యలు ఉన్నా కూడా నారింజ రంగులో మూత్రం వస్తుంది. ఇంకొందరికి ఎరుపు లేదా పింక్ రంగులో వస్తుంది. ఇలా వస్తే.. కిడ్నీలో స్టోన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్ల బారిన పడ్డారని అర్థం. కాబట్టి వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.




