- Telugu News Photo Gallery Cinema photos Actress Chandini Chowdary comments in Gaami press meet telugu cinema news
Chandini Chowdary: హీరోలను, డైరెక్టర్లనే అడుగుతారు.. చాందిని చౌదరి కామెట్స్ వైరల్..
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ప్రయాణం మొదలుపెట్టి కలర్ ఫోటో సినిమాతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాలో కనిపించింది. ఇందులో చాందిని నటనకు ప్రశంసలు వచ్చాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో చాందిని లైఫ్ రిస్క్ పెట్టి మరీ నటించింది.
Updated on: Mar 14, 2024 | 2:09 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ప్రయాణం మొదలుపెట్టి కలర్ ఫోటో సినిమాతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాలో కనిపించింది. ఇందులో చాందిని నటనకు ప్రశంసలు వచ్చాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.

వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో చాందిని లైఫ్ రిస్క్ పెట్టి మరీ నటించింది. హిమాలయాల్లో ఎన్నో కష్టాలు పడి గామి కోసం నిలబడింది. ఐదేళ్లు సాగినా ఈ సినిమాను నమ్మింది. అలాగే ఎన్నో సాహసాలు చేసింది.

తాజాగా గామి సక్సెస్ కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది చిత్రయూనిట్. అనంతరం తిరుపతిలోని ఓ థియేటర్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే అక్కడి మీడియా టీంకు పలు ప్రశ్నలు అడగ్గా సమాధానాలు ఇచ్చారు.

ఈ ప్రెస్ మీట్ చివర్లో చాందిని మాట్లాడుతూ సినిమా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఏంటో అందరూ హీరో, డైరెక్టర్లనే ప్రశ్నలు అడుగుతారు. హీరోయిన్లను పట్టించుకోరు. ప్రశ్నలు అడగరు. నేను ఎప్పట్నుంచో ఇది చూస్తున్నాను.

ప్రెస్ మీట్స్ లో లేడీ ఆర్టిస్టులను ప్రశ్నలు అడగరు అని కామెంట్స్ చేసింది. దీంతో వెంటనే ఓ మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడగ్గా.. మొహమాటానికి వద్దులెండి అని అనేసింది. ఇక పక్కనే ఉన్న విశ్వక్ సేన్ ఇప్పుడు చివర్లో నువ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతాయని సరదాగా అన్నాడు.




