Get Rid of Lice: ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకున్నా పేలు అన్నీ మాయం..
తలకు సంబంధించిన సమస్యల్లో పేలు కూడా ఒకటి. పేలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోవడం, చుండ్రు పట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఈ చిట్కా ట్రై చేస్తే ఖచ్చితంగా పేలు బయటకు పోతాయి. ఒక్క పేను కూడా ఉండదు..
ఎంతో మంది ఎదుర్కొనే సమస్యల్లో పేలు కూడా ఒకటి. తలలో పేలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కొందరికి పేలు తలలో విపరీతంగా ఉంటాయి. దీని జుట్టు రాలిపోవడం, చుండ్రు పట్టడం, జుట్టుకు పోషకాలు అందకపోవడం, దురద.. వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలు తల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. దీని వల్ల బయట ఎక్కువ సేపు తిరగలేం. దురదగా ఉంటుంది. తలలో పేలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం, నెత్తి మీద మురికి పట్టడం వల్ల తలలో పేలు పడుతూ ఉంటాయి. ఈ పేలు ఒకటి, రెండు కాస్తా ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. తలలో పేలు పోవడానికి అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. పేలు పోగొట్టుకోవడానికి ఈ హెయిర్ మాస్క్ ఎంతో చక్కగా పని చేస్తుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పేలు తొలగించే హెయిర్ మాస్క్:
పేలు తొలగించేందుకు ఈ హెయిర్ మాస్క్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి. ఇందులో కొద్దిగా కలబంద జెల్, మూడు లేదా నాలుగు చుక్కల టీట్రీ ఆయిల్‌ను వేయండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్‌ను కుదుళ్ల నుంచి మొత్తం వెంట్రుకలకు అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను ఒక గంట పాటు అలాగే ఉంచాలి. అయితే ఈ నూనె పెట్టుకున్నప్పుడు కళ్లకు అంటకుండా చూసుకోవాలి.
ఆ తర్వాత షాంపూ, కండీషనర్‌తో తలస్నానం చేసి జుట్టును శుభ్రం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల తలలో ఒక్క పేను కూడా ఉండదు. కెమికల్ ఉండే వాటిని వాడటం కంటే.. ఇలాంటి నేచురల్ పద్దతులు పాటించడం వల్ల పేలు ఎంతో చక్కగా పోతాయి. ఇలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. తల రాలడం, చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్ చేయడం వల్ల తల మెత్తగా కూడా తయారవుతుంది. పేలు ఉన్నా లేకపోయినా ఈ ప్యాక్ చేస్తే.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.