Drinking Honey: చలికాలంలో తేనె తాగితే ఏమవుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

తేనె ఆరోగ్యానికి చాలా లాభదాయకం. చలికాలంలో తేనె తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అద్బుతమైన ఔషధంలా పనిచేస్తుంది. చలికాలంలో మరింత మంచిది. తేనెలో ఉండే వివిధ రకాల పోషకాలు చాలా వ్యాధుల్నించి కాపాడుతాయి. తేనెతో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 04, 2024 | 4:48 PM

చలికాలంలో తేనె తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గుండె ముప్పు, చర్మం, దంతాలకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతుంది.

1 / 5
తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. తేనెలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. తేనెలోని గుణాలు అంటు వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. తేనెను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు,గొంతు నొప్పి వంటి సమస్యలను తేనెతో సులభంగా నివారించుకోవచ్చు.

2 / 5
గోరు వెచ్చని నిమ్మకాయ నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. ఒక స్పూన్ తేనె, అరస్పూన్ లవంగాల పొడి కలిపి తీసుకుంటే మంచిది. వాటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నీరోధక శక్తని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను నివారిస్తుంది.

3 / 5
హెర్బల్ టీలో తేనె కలిపి తీసుకుంటే మానసిక సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళ్తాయి. తేనె గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. మలబద్ధకం కడుపు సంబంధిత వ్యాధుల్ని దూరం చేసేందుకు తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాత్రి వేళ 1 గ్లాసు నీళ్లలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే అజీర్తి, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

4 / 5
రెండు స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే సైనస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ తేనె, అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఇలా చలికాలంలో రోజూ తేనె తీసుకోవడం వల్ల సుఖంగా నిద్రపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది.

5 / 5
Follow us