కాలీఫ్లవర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
కానీ ప్రతిరోజూ కాలీఫ్లవర్ తినడం కొంతమందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తినకండి. కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
కాలీఫ్లవర్ ముఖ్యంగా T3, T4 హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, థైరాయిడ్ రోగులు కాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి.
గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది. కాలీఫ్లవర్‌లో క్యాల్షియం ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది.
మీకు రక్తం గడ్డకట్టే సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ తినవద్దు. కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని రక్తాన్ని చిక్కగా చేస్తుంది.ఇలాంటి వారు కాలీఫ్లవర్ అస్సలు తినకూడదు.
గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ తినకూడదు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి క్యాలీఫ్లవర్‌ను నివారించడం చాలా ముఖ్యం.