మహిళలల్లో వచ్చే నెలసరి సమస్యలకు టోఫు బాగా ఉపయోగపడుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు ఈస్ట్రోజెన్ హార్మోన్‌గా పనిచేస్తుంది. ఇది నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో టోఫు బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
టోఫులో ఫైటోఈస్ట్రోజెన్‌లు పుష్కలంగా ఉంటయాఇ. ఇవి జ్ఞాపకశక్తి క్షీణతను నివారించడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
టోఫును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో తరచూ వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అధిక బరవుతో బాధపడుతున్నారా.? అయితే కచ్చితంగా టోఫును ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావవను కలిగిస్తుంది.
టోఫును క్రమంతప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఐసోఫ్లేవోన్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎముకలు దృఢంగా మార్చడంలో కూడా టోఫు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.