మునక్కాయలు రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, ఇ,కాల్షియం,పొటాషియం,ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
TV9 Telugu
మునక్కాయల్లో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. పిల్లలు, వృద్ధులకు ఎముకల ఆరోగ్యం కోసం మునక్కాయలు చాలా మంచివి.
TV9 Telugu
మునక్కాయల్లో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని పొటాషియం రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, రక్తపోటును నియంత్రిస్తుంది.
TV9 Telugu
మునక్కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. మునక్కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి.
TV9 Telugu
మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.
TV9 Telugu
మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునక్కాయలకు అలర్జీ ఉన్నవారు తినకూడదు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుని తినాలి.
TV9 Telugu
మునక్కాడలో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి.
TV9 Telugu
అధిక రక్తపోటు ఉన్నవారికి మునక్కాయ మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి, రక్తపోటును నియంత్రిస్తుంది.