బరువు తగ్గాలనుకునే వారికి కళోంజీ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది.
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్ గా చెప్పాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ విత్తనాల నీటిని తీసుకోవడం వల్ల. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఈ విత్తనాల నీటిని తీసుకోవాలి.
కడుపుబ్బరం, అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
ఈ విత్తనాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఫ్యారాసైడ్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి. కలోంజీ సీడ్స్ సోరియాసిస్, మొటిమలను తగ్గిస్తాయి.
థైరాయిడ్ తో ఇబ్బంది పడుతోన్న వారికి కూడా ఈ విత్తనాలు బాగా ఉపయోగపడతాయి. మీ డైట్‌లో కలోంజి విత్తనాలు చేర్చుకుంటే.. థైరాయిడ్ పనితీరును మెరుగపరచుకోవచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.