- Telugu News Photo Gallery Cinema photos Latest tollywood directors Venky Atluri, Sujeeth, Mallik Ram now trending with hit movies
ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్
ఎప్పుడూ సీనియర్లేనా.. మాకూ ఓ అవకాశం ఇచ్చి చూడండి... దుమ్ము రేపుతాం అంటున్నారు యువ దర్శకులు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాలు తీయగలం అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి సక్సెస్‌లే కాదు.. ఇయర్ మొత్తం చూసినా యంగ్ కెప్టెన్సీ హుషారుగా కనిపిస్తోంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 04, 2024 | 10:42 PM

ఎప్పుడూ సీనియర్లేనా.. మాకూ ఓ అవకాశం ఇచ్చి చూడండి... దుమ్ము రేపుతాం అంటున్నారు యువ దర్శకులు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాలు తీయగలం అని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి సక్సెస్‌లే కాదు.. ఇయర్ మొత్తం చూసినా యంగ్ కెప్టెన్సీ హుషారుగా కనిపిస్తోంది.

లైఫ్‌లో చాలా విషయాలు ఇవ్వలేని కిక్‌ని డబ్బు ఇస్తుందని చెబుతూ ప్రీ రిలీజ్ నుంచే ఆసక్తి పెంచిన మూవీ లక్కీ భాస్కర్. ఓ సెక్టార్ పీపుల్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని జనాలందరికీ నచ్చేలా కూల్‌గా తెరకెక్కించారు వెంకీ అట్లూరి అంటూ మెచ్చుకుంటున్నారు ఆడియన్స్.

దీపావళికి విడుదలైన క మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదిరిపోయే క్లైమక్స్ తో, సబ్జెక్ట్ ని అద్భుతంగా డీల్ చేశారంటూ పేరు తెచ్చుకున్నారు దర్శకద్వయం సుజీత్ సందీప్. తెరమీద ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ అంటూ కిరణ్ అబ్బవరం చేసుకున్న ప్రమోషన్లకు పట్టం కడుతున్నారు జనాలు.

లాస్ట్ ఇయర్ డీజే టిల్లుకి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. మరి సీక్వెల్‌ని కూడా అదే బ్రాండ్‌తో అంతకన్నా సక్సెస్ చేసి చూపించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకున్నారు మల్లిక్ రామ్. టిల్లు స్క్వేర్‌ని డబుల్ సక్సెస్ చేసి చూపించి సూపర్బ్ అనిపించుకున్నారు.

సినిమాటిక్ యూనివర్శ్‌ల పేర్లు చెప్పుకోవాల్సి వస్తే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌ని మర్చిపోకూడదు. హనుమాన్‌తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ మెప్పు పొందేశారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు జై హనుమాన్‌తో పాటు ఆయన అనౌన్స్ చేసిన సినిమాల మీద మరింత ఫోకస్ ఉంది... ఒక్క అవకాశం ఇవ్వాలేగానీ, యంగ్ డైరక్టర్లు బ్లాక్ బస్టర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఈ సక్సెస్‌లన్నీ చెప్పకనే చెబుతున్నాయంటున్నారు క్రిటిక్స్.





























