Anti-Hairfall Oil: ఈ నూనెను అప్లై చేసి కేవలం 5 నిమిషాలు మసాజ్ చేస్తే చాలు.. జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది!
ఈ నూనె మీ జుట్టు రాలడంలో మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ని మీ హెయిర్ కేర్ రెజిమెన్‌లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం అదుపులో ఉంటుంది. జుట్టు అందంగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
జుట్టు మన అందాన్ని మెరుగుపరుస్తుంది. కానీ నేటి మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. దీనితో పాటు జుట్టు క్రమంగా పలుచగా మారుతుంది. చిన్న వయసులోనే బట్టతల సమస్య ఏర్పడుతుంది. దీంతో చాలా మంది మానసికంగా కూడా కుంగిపోతుంటారు. మీకు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటే.. దానిని నియంత్రించే నూనె ఒకటి ఉంది.. మందార నూనె, బాదం నూనె కలయిక మీ జుట్టు రాలడంలో మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ని మీ హెయిర్ కేర్ రెజిమెన్‌లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం అదుపులో ఉంటుంది. జుట్టు అందంగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. మందారలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. ఈ నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు
> కొన్ని చుక్కల మందార నూనె >> రెండు చెంచాల బాదం నూనె
జుట్టు రాలడాన్ని నియంత్రించే నూనెను ఎలా తయారు చేయాలి?
>> హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ సిద్ధం చేయడానికి, ముందుగా ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. >> తర్వాత దానికి కాస్త గోరువెచ్చని మందార నూనె వేసి సరిగ్గా కలపాలి. >> ఇప్పుడు మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ రెడీ.
జుట్టు రాలడాన్ని నియంత్రించే నూనెను ఎలా అప్లై చేయాలి?
> హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తీసుకుని మీ తలకు బాగా అప్లై చేయండి. >> తర్వాత కనీసం 5-10 నిమిషాల పాటు మీ జుట్టును అన్ని వైపుల నుండి సరిగ్గా మసాజ్ చేయండి. >> దీని తర్వాత, మీరు ఒక గంట పాటు జుట్టును అలాగే వదిలేయండి. >> తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..