వెంటాడుతున్న వీధి కుక్కలు.. తృటిలో తప్పించుకున్న చిన్నారి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. జరిగిన ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంనుంచి వీధి కుక్కలను తరలించాలని కోరుకుంటున్నారు.

వెంటాడుతున్న వీధి కుక్కలు.. తృటిలో తప్పించుకున్న చిన్నారి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 07, 2023 | 6:51 PM

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. హైదరాబాద్‌, అమలాపురం వరకు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్నటి మొన్న హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వీధి కుక్కల బెడదను నియంత్రించడానికి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. పలుచోట్ల వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే బాలిక తృటిలో వాటినుంచి తప్పి్ంచుకుంది.

సిద్దిపేట జిల్లా కోహెడలో వీధి కుక్కల దాడి నుంచి బాలిక తృటిలో తప్పించుకుంది. స్కూల్‌ యూనిఫామ్‌లో దారి వెంట వెళ్తున్న చిన్నారిని రెండు కుక్కలు వెంబడించాయి. దీంతో ఆ చిన్నారి వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టింది. చిన్నారిని కుక్కలు కూడా వెంబడించాయి. ఈ క్రమంలోనే చిన్నారులు అరుపులు విన్న ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న వస్తువుతో కుక్కలను కొట్టి బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఆ చిన్నారి ఊపిరి పిల్చుకుంది.

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. జరిగిన ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంనుంచి వీధి కుక్కలను తరలించాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..