AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Tulsi Plant: ఏడడుగుల తులసి మొక్క..! మునుపెన్నడూ చూడని అద్భుతం.. మీరూ ఓ లుక్కేయండి..

అయితే, ఈ మొక్క ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం చాలా వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మంచి నేల, సరిపడా నీటి సౌకర్యం ఈ మొక్క పెరుగుదలకు అవసరమన్నారు.

Giant Tulsi Plant: ఏడడుగుల తులసి మొక్క..! మునుపెన్నడూ చూడని అద్భుతం.. మీరూ ఓ లుక్కేయండి..
Giant Tulsi Plant
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2023 | 6:18 PM

Share

ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పక ఉంటుంది. తులసిని హిందువులు పవిత్రంగా భావించి పూజిస్తుంటారు. ఏ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టినా మొదట కనిపిస్తుంది తులసి కోట లేదంటే తులసి మొక్క. అలాంటి తులసి మొక్క సాధారణంగా 2 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతుంది. అయితే గుజరాత్‌లోని వడోదరలో మాత్రం తులసి మొక్క భారీ ఎత్తుతో పెరిగింది. దానికి సంబంధించిన షాకింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తులసి మొక్క పొడవు 7 అడుగులుగా తెలిసింది.. ఈ మొక్క ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తులసి మొక్క ఏడడుగులు ఎలా పెరిగిందంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది వడోదరలోని అకోటా నివాసి మనోజ్ త్రిపాఠి ఇంట్లో ఉంది.

మనోజ్ త్రిపాఠి ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. అతని ఇంట్లోనిదే ఈ భారీ పొడవైన తులసి మొక్క. ఏపుగా పెరుగుతున్న ఈ తులసి మొక్కను చూసి మనోజ్ మరింత జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. అలా పెరుగుతూ పోయిన ఈ తులసి మొక్క ప్రపంచ రికార్డును లిఖించాలని అతను కోరుకుంటున్నారు. ఈ తులసి మొక్క గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూడగా, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తులసి మొక్క 11 అడుగుల పొడవు ఉందని అతనికి తెలిసింది. ప్రపంచంలోనే అతి పొడవైన తులసి మొక్క గ్రీస్‌లో ఉన్నట్టుగా తెలిసింది.

ఈ తులసి మొక్క గురించి అడిగినప్పుడు, మనోజ్ మాట్లాడుతూ.. ఇది రామ తులసి మొక్క అడవి జాతి అని చెప్పారు. ఈ తులసి మొక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఈ మొక్క అద్భుతమైన పెరుగుదల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ మొక్క ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం చాలా వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మంచి నేల, సరిపడా నీటి సౌకర్యం ఈ మొక్క పెరుగుదలకు అవసరమన్నారు. ఇకపోతే, భవిష్యత్తులో ఈ తులసి మొక్క ప్రపంచ రికార్డును లిఖిస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్