AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd Rice Benefits: పెరుగన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. డోంట్ మిస్!

పెరుగన్నం గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పని లేదు. అందరికీ పెరుగన్నం గురించి తెలుసు. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. నిజానికి పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతున్నారు నిపుణులు. పెరుగన్నంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. మీరు రెస్టారెంట్స్‌లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాళింపు పెట్టి.. నీటిగా ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకొస్తారు. రెస్టారెంట్లలో కూడా చాలా మంది పెరుగన్నాన్ని తింటారు. పెరుగు అన్నం తింటే శరీరాన్ని..

Curd Rice Benefits: పెరుగన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. డోంట్ మిస్!
Curd Rice
Chinni Enni
|

Updated on: Jan 27, 2024 | 5:28 PM

Share

పెరుగన్నం గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పని లేదు. అందరికీ పెరుగన్నం గురించి తెలుసు. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. నిజానికి పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతున్నారు నిపుణులు. పెరుగన్నంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. మీరు రెస్టారెంట్స్‌లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాళింపు పెట్టి.. నీటిగా ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకొస్తారు. రెస్టారెంట్లలో కూడా చాలా మంది పెరుగన్నాన్ని తింటారు. పెరుగు అన్నం తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది. ఇంకా పెరుగన్నంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్టీరియాతో పోరాడుతుంది..

పెరుగు అన్నం క్రమం తప్పకుండా తింటే రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. పెరుగు అన్నంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు, ప్రేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు పెరుగన్నం తింటే చాలా బెటర్. పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు అన్నం తింటే గ్యాస్, కడపులో నొప్పి, మంట, మల బద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎముకలు, దంతాలు హెల్దీగా ఉంటాయి..

పెరుగులో క్యాల్షియం కంటెంట్ మెండుగా ఉంటుది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగు అన్నం తింటే ఎముకలు, దంతాలు కూడా గట్టి పడతాయి. పలు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

బరువు అదుపులో ఉంటుంది:

బరువు తగ్గాలి అనుకున్న వారు పెరుగు అన్నం తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆకలి పెద్దగా వేయదు. దీంతో ఇతర చిరు తిళ్లు తినే అవకాశం ఉండదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది కూడా మీ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, క్యాల్షియంలు మీ ఆకలిని నియంత్రిస్తాయి. ఇలా బరువు తగ్గొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ