AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఇలా చేస్తే ఒత్తైన కురులు.. నిగనిగలాడే ముఖం మీ సొంతం..

చలికాలంలో శరీరం పొడిబారిపోతుంది. శరీర భాగాలు ఎముకలు కొరికే చలికి బిగిసుకుపోతుంది. జుట్టు, చర్మం విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన శరీరం విషయమే కాకుండా నీళ్లు, నూనెలు కూడా గడ్డ కట్టుకుపోతాయి. ముఖ్యంగా ఇంట్లో పామోలిన్ వాడే వారికైతే ఈ విషయం బాగా తెలుస్తుంది. అయితే కొబ్బెరి నూనె నిత్యం జుట్టుకు రాస్తూ ఉంటాము కాబట్టి నూనె గడ్డ కట్టడం చూస్తూ ఉంటారు.

Beauty Tips: ఇలా చేస్తే ఒత్తైన కురులు.. నిగనిగలాడే ముఖం మీ సొంతం..
Benefits Of Coconut Oil
Srikar T
| Edited By: |

Updated on: Jan 28, 2024 | 1:02 PM

Share

చలికాలంలో శరీరం పొడిబారిపోతుంది. శరీర భాగాలు ఎముకలు కొరికే చలికి బిగిసుకుపోతుంది. జుట్టు, చర్మం విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన శరీరం విషయమే కాకుండా నీళ్లు, నూనెలు కూడా గడ్డ కట్టుకుపోతాయి. ముఖ్యంగా ఇంట్లో పామోలిన్ వాడే వారికైతే ఈ విషయం బాగా తెలుస్తుంది. అయితే కొబ్బెరి నూనె నిత్యం జుట్టుకు రాస్తూ ఉంటాము కాబట్టి నూనె గడ్డ కట్టడం చూస్తూ ఉంటారు. ఇలాంటప్పడూ కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. వీటిని మన ఇంట్లో బామ్మలు ఉంటే బాగా చెప్పేవారు. ప్రస్తుతం అందరిదీ బిజి బిజి పరుగుల బ్రతుకులే. ఇంట్లో పెద్దవాళ్లంటూ ఎవరూ ఉండరు. సొంతూళ్లు వదిలిపెట్టి పక్కన ఊళ్లోకి వచ్చి పనిచేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. దీంతో కొబ్బెరి నూనె వాడకుండా వదిలేస్తారు. అప్పుడు కురులు మృదుత్వం కొల్పోతుంది. వెంట్రుకల బలం తగ్గిపోతుంది. జుట్టు సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. వాటి నుంచి నివారణకు ఇలా చేస్తే సరిపోతుంది.

ఒత్తైన కురుల కోసం..

  • తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి.
  • ఇలా వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  • జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఇక ముఖానికి చిట్కా..

  • ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి.
  • ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్‌ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది.
  • వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం సరికొత్త నగలాగా నిగనిగలాడుతుంది.

కొబ్బెరి నూనె గడ్డ కట్టకుండా ఎలా..

  • టేబుల్‌ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకోవాలి.
  • కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు.
  • ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా మారదు.
  • పైగా బాదం, ఉసిరిలోని పోషకపదార్థాలు జుట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..