AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Caramel Popcorn: సినిమా హాల్స్‌లో లభించే క్యారమెల్ పాప్‌కార్న్.. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు!

సినిమాకు వెళ్లామంటే ఖచ్చితంగా పాప్ కార్న్ ఉండాల్సిందే. పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ ఈ పాప్‌ కార్న్‌ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండేవారు. ఇలా పాప్ కార్న్‌లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు బాగా పాపులర్ అయిన పాప్‌ కార్న్‌లో క్యారమెల్ పాప్ కార్న్‌ కూడా ఒకటి. ఇది తియ్యగా చాలా బావుంటుంది. పిల్లలు మరింత ఇష్టంగా దీన్ని తింటూ ఉంటారు. ఈ క్యారమెల్ పాప్‌కార్న్‌ని ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట ఎక్కువ ధరలకు కొనే..

Caramel Popcorn: సినిమా హాల్స్‌లో లభించే క్యారమెల్ పాప్‌కార్న్.. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు!
Caramel Popcorn
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 28, 2024 | 1:02 PM

Share

సినిమాకు వెళ్లామంటే ఖచ్చితంగా పాప్ కార్న్ ఉండాల్సిందే. పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ ఈ పాప్‌ కార్న్‌ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండేవారు. ఇలా పాప్ కార్న్‌లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు బాగా పాపులర్ అయిన పాప్‌ కార్న్‌లో క్యారమెల్ పాప్ కార్న్‌ కూడా ఒకటి. ఇది తియ్యగా చాలా బావుంటుంది. పిల్లలు మరింత ఇష్టంగా దీన్ని తింటూ ఉంటారు. ఈ క్యారమెల్ పాప్‌కార్న్‌ని ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. బయట ఎక్కువ ధరలకు కొనే బదులు.. ఇంట్లో హెల్దీగా సిద్ధం చేసుకోవచ్చు. మరి ఈ క్యారమెల్ పాప్‌ కార్న్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారమెల్ పాప్‌ కార్న్‌కి కావాల్సిన పదార్థాలు:

పాప్ కార్న్, పంచదార, బటర్, వంట సోడా, ఆయిల్.

క్యారమెల్ పాప్‌ కార్న్‌ తయారీ విధానం:

ముందుగా లోతుగా, మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాంటిటీలో పాప్ కార్న్ గింజలు వేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఓ అర నిమిషం వదిలేస్తే.. పాప్ కార్న్ తయారవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో పాత్రను కదుపుతూ ఉండాలి. ఇలా పాప్ కార్న్ తయారవుతుంది. వీటిని ఏదైనా పాత్ర లేదా ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో పంచదార వేసి కరిగేంత వరకూ వేడి చేయాలి. ఈ పంచదార కదిలించకుండా అలాగే ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

పంచదార పూర్తిగా కరిగిపోయాక బటర్ వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగి నురగ వస్తున్న సమయంలో వంట సోడా వేయాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పాప్‌ కార్న్‌ని పంచదార మిశ్రమంలో వేసుకుని అంతా బాగా కలుపాలి. ఈ పాప్ కార్న్ ఒక ట్రేలోకి తీసుకుని చల్లారే వరకు అలాగే ఉంచాలి. పాప్ కార్న్ చల్లారి తర్వాత విడి విడిగా చేసి.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారమేల్ పాప్ కార్న్ రెడీ. పిల్లలకు ఏమైనా స్పెషల్‌గా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇవి తయారు చేసి పెట్టొచ్చు. అంతే కాకుండా ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసేయొచ్చు. తక్కువ సమయంలోనే అవుతుంది.

జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?