Nethalla Iguru: పచ్చి నెత్తళ్లతో ఇగురు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది!

చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా నెత్తళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిలో పచ్చివి, ఎండువి రెండూ లభ్యమవుతాయి. కానీ పచ్చివి తింటేనే ఎంతో ఆరోగ్యం. వీటిని బెండకాయ, వంకాయ, దోసకాయ, మునక్కాయలతో కూడా కలిపి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పెద్దగా నీచు వాసన కూడా రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలు సైతం..

Nethalla Iguru: పచ్చి నెత్తళ్లతో ఇగురు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది!
Nethalla Iguru
Follow us

|

Updated on: Jan 28, 2024 | 6:20 PM

చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా నెత్తళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిలో పచ్చివి, ఎండువి రెండూ లభ్యమవుతాయి. కానీ పచ్చివి తింటేనే ఎంతో ఆరోగ్యం. వీటిని బెండకాయ, వంకాయ, దోసకాయ, మునక్కాయలతో కూడా కలిపి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పెద్దగా నీచు వాసన కూడా రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలు సైతం వీటిని పెట్టొచ్చు. వీటిల్లో ముళ్లు పెద్దగా ఉండదు. ముఖ్యంగా వీటిని బాలింతలకు పెడతారు. ఇవి తినడం వల్ల పాలు పడతాయని పెద్దలు చెబుతారు. వీటితో ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ నెత్తళ్ల ఇగురును ఎలా తయారు చేస్తారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెత్తళ్ల ఇగురుకు కావాల్సిన పదార్థాలు:

నెత్తళ్లు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్.

నెత్తళ్ల ఇగురు తయారీ విధానం:

ముందుగా పచ్చి నెత్తళ్లను శుభ్రంగా నీచు వాసన రాకుండా కడిగాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఇవి వేగాక ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక.. కారవం, నెత్తళ్లు వేసి ఓ ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇప్పుడు అవసరం అయినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు దగ్గర పడుతున్నప్పుడు గరం మసాలా వేసి మరికాసేపు ఉడికించాలి. నెక్ట్స్ కర్రీ దగ్గర పడేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్లు ఇగురు రెడీ.

సీరియల్లో అలా.. నెట్టింట ఇలా.. రుద్రాణి అత్తా మజాకా..
సీరియల్లో అలా.. నెట్టింట ఇలా.. రుద్రాణి అత్తా మజాకా..
బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌... ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే.
బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌... ఫీచర్లు తెలిస్తే వావ్‌ అనాల్సిందే.
ఆదివాసీ గూడాల్లో మొదలైన గుస్సాడి పండుగ..గిరిజనులంతా కలిసి ఇలా..
ఆదివాసీ గూడాల్లో మొదలైన గుస్సాడి పండుగ..గిరిజనులంతా కలిసి ఇలా..
అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.?
అయ్యబాబోయ్.! ఏం అందం.. నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.?
సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ధోని ఏం చేశాడంటే.. వైరల్ వీడియో
ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ధోని ఏం చేశాడంటే.. వైరల్ వీడియో
'రా' మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన అభియోగాలు..!
'రా' మాజీ ఉద్యోగిపై అమెరికా సంచలన అభియోగాలు..!
హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..
హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.స్వర్గం, నరకం చూసొచ్చానంటూ
చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.స్వర్గం, నరకం చూసొచ్చానంటూ