Ragi Java: సమ్మర్‌లో రోజూ రాగి జావ తాగండి.. వచ్చే మార్పులు మీకే తెలుస్తుంది..
సమ్మర్ వచ్చేసింది. కాబట్టి మీ డైట్‌లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే. వింటర్ తిన్నట్టు ఆహార పదార్థాలు సమ్మర్‌లో తింటే రోగాల బారిన పడాల్సి వస్తుంది. సమ్మర్‌లో తేలికైనా ఆహారాలు తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఉండే ఫుడ్స్ తినడం వల్ల డీ హైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటారు. వేసవి కాలంలో ఎక్కుగా నీరసానికి, అలసటకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో రాగులు కూడా ఒకటి. ప్రతి రోజూ రాగులను..

సమ్మర్ వచ్చేసింది. కాబట్టి మీ డైట్‌లో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే. వింటర్ తిన్నట్టు ఆహార పదార్థాలు సమ్మర్‌లో తింటే రోగాల బారిన పడాల్సి వస్తుంది. సమ్మర్‌లో తేలికైనా ఆహారాలు తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఉండే ఫుడ్స్ తినడం వల్ల డీ హైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటారు. వేసవి కాలంలో ఎక్కుగా నీరసానికి, అలసటకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో రాగులు కూడా ఒకటి. ప్రతి రోజూ రాగులను మీ అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. రాగి జావను కేవలం బ్రేక్ ఫాస్ట్‌లోనే కాకుండా.. డిన్నర్‌లో తీసుకున్నా చాలా మంచిది. కాబట్టి గోధుమ పిండిని ఇష్ట పడని వారు రాగి పిండిని కూడా ఉపయోగించవచ్చు. రాగి జావను తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
రాగి జావలో పోషకాలు:
విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీ కాంప్లెక్స్, జింక్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు బాగా ఉంటాయి.
వెయిట్ లాస్ అవుతారు:
రాగిజావలో ఫైబర్, ప్రోటీన్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహితమైనవి కూడా. కాబట్టి రాగి జావను తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇది ఒక గ్లాస్ తాగినా.. కనీసం నాలుగు గంటల వరకూ ఆకలి వేయదు. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. చిరుతిళ్లను కూడా తినరు. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
పొట్టకు హాయిగా ఉంటుంది:
సమ్మర్‌లో వేడి వేడిగా ఉండే ఆహారాలు, మసాలాలతో కూడిన ఆహారాలు, జంక్ ఫుడ్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే రాగి జావను తాగడను తాగడం వల్ల పొట్టకు చాలా హాయిగా, చల్లగా ఉంటుంది. పైగా ఇది ఆరోగ్యం కూడా.
ఎముకలకు మంచిది:
కేవలం సమ్మర్‌లోనే కాకుండా రోజూ రాగి జావ తాగితే.. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. బలంగా, దృఢంగా ఉంటాయి. భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. అస్థి పంజర వ్యవస్థను కాపాడుతుంది.
డయాబెటీస్ వారికి మంచిది:
డయాబెటీస్‌తో బాధ పడేవారు రాగి జావ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. రాగి జావను రోజూ తాగితే.. షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








