Jeera Health Benefits: పోపుల పెట్టెలో ఉన్న జీలకర్రతో ఇన్ని లాభాలున్నాయా..?
ఒత్తిడిని తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రను తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రని తీసుకుంటే మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మన వంట గదిలో వుండే మసాలా దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ, బరువు తగ్గాలనుకుంటే జీలకర్ర బెస్ట్ రెమిడీగా పనిచేస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. షుగర్ ఉన్నవారు జీలకర్రని తీసుకుంటే మంచిది. టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. జీలకర్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల పేగు కండరాలు బలంగా మారతాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది.
జీలకర్రని తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రను తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రని తీసుకుంటే మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీలకర్ర నీరు మధుమేహ రోగులకు ఔషధం లాంటిదని అంటారు. జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులే కాకుండా ఊబకాయం ఉన్నవారు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ సమస్యని అడ్డుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. లివర్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి వాటి నుంచి దూరంగా ఉంచుతుంది. మంచి నిద్రని పొందాలంటే జీలకర్రను తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే మెలటోనిన్ హాయిగా నిద్ర పట్టేటట్టు చూస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. జీలకర్రలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








